పవన్ తో ఫోటో కోసం రేణూ దేశాయ్ అంతలా ఆరాటపడిందా..?

Tue May 24 2022 16:00:01 GMT+0530 (IST)

Is Renu Desai looking for a photo with Pawan

పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్ ల ముద్దుల తనయుడు అకీరా నందన్ తన స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి తల్లిదండ్రులుగా పవన్ - రేణూ కూడా హాజరయ్యారు.పవన్ - రేణూ దేశాయ్ లు చట్టబద్ధంగా భార్యాభర్తలుగా విడిపోయి దూరంగా ఉన్నా.. పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు. పవన్ కు వీలు కుదిరినప్పుడల్లా రేణు ఇంటికి వెళ్లి అకీరా - ఆద్యలతో సమయం గడిపి వస్తుంటారు. పిల్లలను బయటకు తీసుకెళ్తుంటారు.

ఇప్పుడు కుమారుడి కోరిక మేరకు అకీరా గ్రాడ్యుయేషన్ డేలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. భార్యతో విడిపోయినా కూడా పిల్లల ఆనందం కోసం తండ్రిగా ఈ ఈవెంట్ కు వెళ్లినందుకు పవన్ ను అందరూ అభినందిస్తున్నారు.

ఫంక్షన్ కు మధ్యలో వచ్చినా.. మొత్తానికి అకీరా స్టేజీ మీదకు వచ్చే సమయానికి పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారని తెలుస్తోంది. ఈ పవన్ - రేణూ ఇద్దరూ తమ పిల్లలతో కలిసి ఫోటో కూడా తీసుకున్నారు. రేణూ స్వయంగా ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ పిల్లల కోసం కలుసుకుంటున్నా.. ఎప్పుడూ కూడా వీరిద్దరూ కలిసి ఉన్న పిక్ బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత మాజీ దంపతులు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అకీరా - ఆధ్యా లతో పవన్ కళ్యాణ్ - రేణూ ఉన్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ పిక్ లో పవన్ కూడా ఉండాలని రేణూ దేశాయ్ చాలా ఆరాటపడిందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో షేర్ చేయాలి కాబట్టి పవన్ ఒప్పుకుంటాడో లేదో అని తన పిల్లలతో ఈ విషయాన్ని చెప్పించిందని.. మొత్తం మీద తనతో పాటుగా మాజీ భర్తను ఒకే ఫ్రేమ్ లోకి తీసుకురాడానికి రేణూ చాలా ప్రయత్నం చేసిందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ మాత్రం దీన్ని చాలా పాజిటివ్ గా తీసుకొని.. తన ఇద్దరు పిల్లలు మరియు మాజీ భార్యతో కలిసి ఫోటో దిగాడు అని చెబుతున్నారు. అయితే ఆ ఫోటో ఆడిటోరియంలో కాకుండా.. పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడు బయట తీసుకున్న ఫోటో అని బ్యాగ్రౌండ్ చూస్తే అర్థం అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి ఈ విషయంలో పవన్ చాలా పాజిటివ్ గా స్పందించి నవ్వుతూ ఫోటో దిగడంతో రేణు దేశాయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

'బద్రి' సినిమాలో కలిసి నటించిన పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్ జంట.. ఈ క్రమంలో ప్రేమించుకొని కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. అకీరా నందన్ పుట్టిన తర్వాత 2009 లో పెళ్లి చేసుకున్నారు. అయితే మూడేళ్ళ తర్వాత వ్యక్తిగత కారణాలతో 2012లో విడాకులు తీసుకున్నారు.

విడాకుల తర్వాత రేణూ దేశాయ్ తన కుమారుడు అకిరా - కూతురు ఆద్యలతో కలిసి ఉంటోంది. రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ.. అది జరగలేదు. పవన్ మాత్రం మరో పెళ్లి చేసుకున్నారు. పిల్లలకు లోటు రానివ్వకుండా రేణు ఇంటికి వెళ్లి పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ వస్తుంటారు.

ఇప్పుడు అకీరా గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పవన్ - రేణూ ఒకే ఫ్రేమ్ లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచారు. రేణూ దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోకి అప్పుడే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ఇటీవల కాలంలో ఆమె షేర్ చేసిన ఏ పోస్ట్ కు కూడా ఇన్ని లైక్స్ రాలేదు. అయితే కామెంట్స్ సెక్షన్ బ్లాక్ చేయడంతో ఫ్యాన్స్ స్పందించడానికి అవకాశం లేకుండా పోయింది.