Begin typing your search above and press return to search.

మాస్ మహారాజ్ రెమ్యునరేషన్ పెంచేసాడా?

By:  Tupaki Desk   |   29 Jan 2023 5:00 PM GMT
మాస్ మహారాజ్ రెమ్యునరేషన్ పెంచేసాడా?
X
మాస్ మహారాజ్ రవితేజ కెరియర్ లో బ్యాక్ టూ బ్యాక్ ధమాకా, వాల్తేర్ వీరయ్య సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ధమాకా సోలోగా హిట్ కొడితే వాల్తేర్ వీరయ్య మెగాస్టార్ తో కలిసి హిట్ ని షేర్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలతో రవితేజ మార్కెట్ రేంజ్ మరింత పెరిగింది అని చెప్పాలి. దీనికి కారణం రెండు సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాయి.

ధమాకాతో మొదటిసారిగా రవితేజ వంద కోట్ల మార్క్ ని అందుకున్నాడు. ఇక నెక్స్ట్ చేయబోతున్న రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుటున్న సినిమాలు కావడం విశేషం. ఈ సినిమాలలో ఒకటి హిట్ అయినా కూడా రవితేజకి కూడా పాన్ ఇండియా మార్కెట్ వచ్చేస్తుంది. ఈ నేపధ్యంలో తన మార్కెట్ రేంజ్ బట్టి రెమ్యునరేషన్ ని తీసుకోవడానికి రవితేజ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

ధమాకా సినిమా కోసం రవితేజ 17 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. వాల్తేర్ వీరయ్య సినిమాకి కూడా ఇంచు మించుగా అంతే స్థాయిలో రవితేజకి ఇచ్చారు. పాత్ర నిడివి తక్కువ అయిన కూడా దాని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని 15 కోట్ల వరకు వాల్తేర్ కోసం రవితేజకి ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఇక రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు కోసం కూడా 17 కోట్ల రెమ్యునరేషన్ ని రవితేజ తీసుకున్నాడు.

అయితే నెక్స్ట్ కమిట్ కాబోయే సినిమాలకి తన బడ్జెట్ పెంచబోతున్నట్లుగా తెలుస్తుంది. 17కి మరో ఐదు పెంచి 22 కోట్ల వరకు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా బ్రాండ్ వస్తే అప్పుడు రెమ్యునరేషన్ 25 నుంచి 30 కోట్ల మధ్య ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. 30 కోట్ల రెమ్యునరేషన్ కి రవితేజ రీచ్ అయితే మాత్రం కచ్చితంగా స్టార్ హీరోల జాబితాలో మాస్ రాజా కూడా చేరిపోవడం పక్కాగా జరుగుతుందని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.