ఐటమ్ సాంగ్ కు రష్మిక సూటయ్యేనా అసలు?

Sun Dec 04 2022 11:00:01 GMT+0530 (India Standard Time)

Is Rashmika suitable for an item song?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా వండర్ 'పుష్ప'. సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్న ఉత్తరాదిలోనూ భారీ క్రేజ్ని సొంతం చేసుకుని బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంది. క్రేజీ ప్రాజెక్ట్ లలో టాప్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది కన్నడ సోయగం.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లోనూ పాగవేసింది.ప్రస్తుతం రష్మిక హిందీలో రెండు క్రేజీ సినిమాల్లో రటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. అంతే కాకుండా తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి 'పుష్ప' సీక్వెల్ 'పుష్ప 2'లోనూ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న 'వారసుడు' మూవీలోనూ నటిస్తోంది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న 'వారసుడు' తమిళ తెలుగు భాషల్లో పొంగల్ కానుకగా జనవరి 12న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ ని ప్రారంభించేశారు.

రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ 'రంజితమే'.. నెట్టింట వైరల్ గా మారి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ మిలియన్ ల వ్యూస్ ని రాబడుతూ విజయవంతంగా దూసుకుపోతోంది. త్వరలో సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా వుంటే రష్మిక మందన్నని ప్రత్యేక సీంగ్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB28 కోసం అడుగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఫస్ట్ షెడ్యూల్ తరువాత మహేష్ మదర్ మృతి చెందడంతో రెగ్యులర్ షూటింగ్ కి బ్రేకిచ్చారు. ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీ రెగ్యులర్ షూట్ కి మరింత గ్యాప్ ఏర్పడే అవకాశం వుందని వార్తలు వినిపించాయి. అయితే త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారని ముందు అనుకున్న కథలలో భారీ మార్పులు జరగడంతో ఫ్రెష్ షెడ్యూల్ ని మొదలు పెట్టడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక స్టోరీ మారడంతో కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ శోభనని ఫైనల్ చేసుకుంటున్నారని అంతే కాకుండా క్రేజీ హీరోయిన్ రష్మిక తో ఓ ప్రత్యేక సాంగ్ కి కూడా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ ప్రత్యేక గీతం కోసం రష్మిక మందన్న భారీగా డియాండ్ చేస్తోందని కోట్లు అడుగుతోందని నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తల తెలిసిన మహేష్ ఫ్యాన్స్ మాత్రం రష్మికకు అంత సీనుందా? అని అదే ఆఫర్ ఇస్తే బాలీవుడ్ క్రేజీ లేడీనే వస్తుందని కామెంట్ లు చేస్తున్నారట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.