రాంచరణ్ రోల్ ఆ రేంజిలో ఉండబోతుందా..??

Tue Jun 01 2021 13:00:12 GMT+0530 (IST)

Is Ramcharan role going to be in high range

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ - దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పొలిటికల్ యాక్షన్ మూవీ పై రోజురోజుకి అంచనాలతో పాటు పుకార్లు కూడా అదే రేంజిలో హల్చల్ చేస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమా రాంచరణ్ కెరీర్లో 15వది. బేసిగ్గా శంకర్ సినిమా అంటేనే అంచనాలు భారీగా నెలకొంటాయి. అలాంటిది ఓ తెలుగు హీరోతో శంకర్ సినిమా అనేసరికి ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ కాంబో మూవీ కోసం మెగాఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వినయ విధేయ రామ ప్లాప్ తర్వాత రాంచరణ్ దర్శకధీరుడు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే రాంచరణ్ శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం చరణ్ చేతిలోని మూవీ ప్రాజెక్టులు బట్టే ఎంత జాగ్రత్తగా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడో తెలుస్తుంది. మరోవైపు శంకర్ తో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై ఊహగానాలతో పాటు సమస్యలు కూడా అదేవిధంగా అల్లుకున్నాయి. డైరెక్టర్ శంకర్ చేతిలో ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్ వివాదం కూడా నడుస్తుంది. ఇటు చూస్తే రాంచరణ్ మూవీకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గతకొన్ని నెలలుగా శంకర్ భారతీయుడు సీక్వెల్ విషయంలో వివాదాలు ఎదుర్కొంటున్నాడు.

కానీ ఇటీవల సమాచారం ప్రకారం.. రాంచరణ్ సినిమాను ఎలాగైనా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈసారి రాంచరణ్ తో ఓ ఛాలెంజింగ్ రోల్ చేయించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చరణ్ క్యారెక్టర్ పై ఇండస్ట్రీలో పలు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మరో క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఏంటంటే.. రాంచరణ్ ఈ సినిమాలో ఓ యూనిక్ రోల్ చేయనున్నాడని.. అలాగే ఆ క్యారెక్టర్ కోసం తన శారీరకంగా మానసికంగా అన్నివిధాలా సన్నద్ధం అవుతున్నాడని టాక్. మరి రాంచరణ్ ఇదివరకు మగధీర - రంగస్థలం లాంటి సినిమాల్లో అద్భుతమైన రోల్స్ చేసాడు. ఇప్పుడు శంకర్ సినిమాలో కూడా రాంచరణ్ అలాంటి క్యారెక్టర్ చేయనున్నట్లు సినీవర్గాలలో బజ్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనుండగా.. హీరోయిన్ ఎవరినేది ఇంకా తెలియాల్సి ఉంది.