ఫిట్ నెస్ బిజినెస్ లో రకుల్ కి పోటీనా?

Tue May 24 2022 15:05:12 GMT+0530 (IST)

Is Rakul Competing in the Fitness Business

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం ఎలానో అందాల భామలకు తెలుసు. ఓవైపు స్టార్ హీరోల సరసన క్రేజీ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో.. మరోవైపు తెలివైన ప్రణాళికలతో చక్క బెట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఎఫ్ 45 పేరుతో హైదరాబాద్ సహా విశాఖపట్నంలో జిమ్ లను తెరిచారు రకుల్ ప్రీత్ సింగ్. ఇవన్నీ ఫ్రాంఛైజీ బిజినెస్ తరహాలో ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. తదుపరి బెంగళూరు చెన్నయ్ వంటి చోట్లకు విస్తరించే ప్లాన్ లో ఉంది రకుల్.ఇప్పుడు ఫిట్ నెస్ బిజినెస్ లో రకుల్ ప్రీత్ కి ఠఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు దూసుకొస్తోంది కృతి సనోన్. 1- నేనొక్కడినే- దోచేయ్ లాంటి చిత్రాలతో నటిగా సత్తా చాటిన కృతి సనోన్ ప్రస్తుతం సలార్ లాంటి క్రేజీ మూవీలో సీత పాత్రకు ఎంపికవ్వడం ఆశ్చర్యపరిచింది. ఈ బ్యూటీ కూడా రకుల్ తరహాలోనే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోంది.

కృతి సనన్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కృతి ఒక వ్యాపారవేత్తగా తన ప్రయాణం ప్రారంభమైందని కీలక ప్రకటన చేసింది. కృతి సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. కృతి `ది ట్రైబ్`ని పరిచయం చేసింది. ఇది వర్చువల్ అండ్ ఇన్-స్టూడియో శిక్షణ. టైలర్ మేడ్ న్యూట్రిషన్ .. కార్పొరేట్ వెల్ నెస్ ను అందించే వెల్ నెస్ స్టూడియో. లాక్ డౌన్ సమయంలోనే కృతి మైండ్ లో ఈ ఆలోచన పుట్టింది. తన చిత్రం MIMI కోసం ఏకంగా 15 కిలోల బరువు తగ్గాల్సి వచ్చిందని సరైన సమయంలో లాక్ డౌన్ ప్రకటించడం తనకు సహకరించిందని తెలిపింది.

పరిశ్రమలో ప్రారంభ రోజుల నుండి కృతి తో ప్రయాణంలో భాగమైన అనుష్క నందిని- కరణ్ సాహ్ని - రాబిన్ బెహ్ల్ తదితర స్నేహితుల బృందం కృతిని ప్రేరేపించారు. తన వ్యక్తిగత ఫిట్ నెస్ నిపుణులుగా ఈ బృందం పనిచేశారు. కృతికి సరైన మార్గదర్శకత్వం అందించారు. కృతి తన వ్యాయామాలను సరదాగా ప్రారంభించింది. కానీ ఇంతలోనే అందులో లీనమైంది. ఎంతో బావుందనుకున్న కృతి అటుపై పెద్దగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ది ట్రైబ్ ని ప్రారంభించింది.

ది ట్రైబ్ శిక్షకుల ద్వారా మీకు మీరుగా అత్యుత్తమ ... ఉత్తమమైన వెర్షన్ గా మారడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తామని నమ్ముతున్నాము. ఇది ఇన్-స్టూడియో... గ్రూప్ .. పర్సనల్ లేదా వర్చువల్ సెషన్ లతో కొంతమంది చక్కని చిన్న వయస్సు  ఫిట్టెస్ట్ ట్రైనర్ లతో శిక్షణ కార్యక్రమమిది. కానీ వర్కౌట్ లను చాలా సరదాగా చేయండి! అంటూ కృతి రాశారు.
ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రజల్లో దీనిపై అవేర్ నెస్ అనూహ్యంగా పెరిగింది. ఇది రకుల్ కి కలిసొచ్చింది. ఇప్పుడు కృతికి కూడా ప్లస్ అవుతుందనే భావించాలి. జిమ్మింగ్ ఫిట్నెస్ కార్యక్రమాల డిజైన్ ఇటీవలి కాలంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో రకరకాల డిజైనర్ ఫిట్నెస్ కార్యక్రమాలు వెల్లువెత్తాయి. కృతి ఎంపిక చేసిన మోడల్ ప్రజల్లోకి ఏ విధంగా దూసుకెళుతుందో చూడాల్సి ఉంది.

మంచు కొండల విహారంలో..!

కృతి ఇటీవల విహార యాత్రలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. మంచు కొండల్లో గ్రీనరీ నడుమ అందాల కథానాయిక కృతి సనోన్  ఫోజులు ఇంతకుముందు వైరల్ అయ్యాయి. కృతి సనన్ తన లడఖ్ పర్యటన నుండి ఫోటో డంప్ ని అభిమానుల కోసం పంచుకుంది.

కృతి సనన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది. ప్రభాస్ తో ఆదిపురుష్  సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ భేదియా - షెహజాదా చిత్రాల కోసం బ్యాక్-టు-బ్యాక్ షూట్ లతో నెలల తరబడి చాలా బిజీగా గడిపింది. ఇప్పుడు పని నుండి కొంత విరామం తీసుకుంది. కృతి ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి లడఖ్ విహారానికి వెళ్లింది. ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వరుస చిత్రాలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి.  కృతి సనన్ తర్వాత వరుణ్ ధావన్ తో కలిసి భేదియాలో నటించనుంది. ఈ చిత్రం నవంబర్ 25న విడుదలవుతోంది. ఆమె టైగర్ ష్రాఫ్ తో గణపత్.. ప్రభాస్‌తో ఆదిపురుష్.. కార్తిక్ ఆర్యన్ తో షెహజాదా వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది.