ఆర్ ఆర్ ఆర్ స్క్రిప్ట్ లో రాజీ పడ్డారా ?

Fri Apr 19 2019 14:16:24 GMT+0530 (IST)

Is Rajamouli Compromise In RRR Movie Script

ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ టీమ్ రామ్ చరణ్ రాగానే వెంటనే షూటింగ్ మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎంపిక చేసిన డైసీ ఎడ్గార్ జోన్స్ హటాత్తుగా తప్పుకోవడంతో ఆ స్థానంలో మరో హీరోయిన్ ని సెట్ చేసేందుకు రాజమౌళి చాలా ప్రయత్నిస్తున్నాడట. ఒకవేళ బ్రిటిష్ అమ్మాయి కనక దొరక్కపోతే ఆ స్థానంలో బాలీవుడ్ భామను రీప్లేస్ చేసేందుకు ఆలోచిస్తున్నట్టుగా టాక్ వచ్చింది.అదేంటి కథ ప్రకారం తెల్ల తోలు సుందరి పాత్రకు వీళ్లెలా సరిపోతారు అనే సందేహం రావొచ్చు. అందుకే కథనే మార్చి బ్రిటిష్ సుందరి బదులు ఆ స్థానంలో భారతీయ అమ్మాయే ఉండేలా కాస్త మార్పు చేయమని రాజమౌళి నాన్న కం కథకులు విజయేంద్ర ప్రసాద్ ని కోరడంతో ఆయన ప్రస్తుతం ఆ పనిలో ఉన్నట్టు వినికిడి. స్క్రిప్ట్ ని ఆసాంతం మార్చాల్సిన అవసరం లేదని కేవలం డైసీ కోసం రాసుకున్న బ్యాక్ డ్రాప్ లో మార్పులు చేస్తే చాలని అనుకుంటున్నట్టుగా తెలిసింది

ఇది నిజమైతే తారక్ కోసం సాహు బ్యూటీ శ్రద్ధా కపూర్ కానీ పరిణితి చోప్రా కానీ వచ్చే అవకాశం ఉంది. అసలు జక్కన్న వీళ్ళతో చర్చలు జరిపాడా లేదా అనే సమాచారం కూడా లేదు. ఇది విన్న తారక్ ఫాన్స్ మాత్రం హ్యాపీగా ఫీలవడం ఖాయం. చరణ్ పక్కన అలియా భట్ ఉంటుంది కాబట్టి దానికి ధీటుగా జూనియర్ పక్కన మరో బాలీవుడ్ బ్యూటీ ఉంటే బాలన్స్ చేసినట్టుగా ఉంటుంది. దీనికి సంబందించిన క్లారిటీ పూణే షెడ్యూల్ రీ స్టార్ట్ అయ్యాక రావొచ్చు. రామ్ చరణ్ గాయం ఓ కొలిక్కి వచ్చిందని ఇంకో పది రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ మళ్ళి మొదలుకావొచ్చని తెలిసింది.