పవన్ సినిమా విషయంలో తొందర పడ్డ నిర్మాతలు..!

Sat Apr 01 2023 11:57:15 GMT+0530 (India Standard Time)

Is Producers Hurried in Pawan Film

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో హరి హర వీరమల్లు సినిమా ఎప్పుడో మొదలవగా ఇప్పటికీ సినిమా పూర్తి కాలేదు. ఈ సినిమా విషయంలో జరుగుతున్న లేట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని నిరుత్సాహపరుస్తుంది. అందుకే వీరమల్లు మీద ఫోకస్ పక్కన పెట్టి హరీష్ శంకర్ సుజిత్ సినిమాల మీద భారీ హోప్ పెట్టుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే హరి హర వీరమల్లు సినిమాను ఎలాగైనా ఈ ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు.అయితే దసరాకి ఆల్రెడీ సినిమాలు ఖర్చీఫ్ వేసాయి. ఇక దీపావళి క్రిస్మస్ మాత్రమే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా డిజిటల్ రైట్స్ ని చాలా తక్కువకే అమ్మేశారట నిర్మాత ఏ.ఎం రత్నం. అలా ఎందుకు అంటే సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే సినిమాకు మంచి డీల్ రాగా అది ఓకే చేశారట.

అయితే ఆ సినిమా వస్తున్న అవుట్ పుట్ చూసి ఇప్పుడు మరో ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చిందట. ఆల్రెడీ డిజిటల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ అమ్మేయడంతో ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి అని తెలుస్తుంది. ఈమధ్య స్టార్ హీరో సినిమాలకు డిజిటల్ శాటిలైట్ రైట్స్ కూడా సినిమా రేంజ్ ని తెలియచేస్తున్నాయి. కొన్ని సినిమాలైతే ముందే డిజిటల్ డీల్ సెట్ చేసుకుంటున్నాయి. వీరమల్లు విషయంలో కూడా అదే జరిగినట్టు తెలుస్తుంది.

క్రిష్ ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారట. పవన్ డేట్స్ వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చింది కానీ సినిమా మాత్రం ఆడియన్స్ కు మంచి ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. సినిమాలో నిధి అగర్వాల్ జాక్వెలిన్ లాంటి అందాల భామలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. పవన్ ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ సినిమాల మీద ఫోకస్ చేయాలని చూస్తున్నారు.

ఆల్రెడీ పవన్ వినోదయ సీతం రీమేక్ కి తన పోర్షన్ పూర్తి చేశారు. ఈ ఏడాదే వినోదయ సీతం రీమేక్ ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. హరి హర వీరమల్లు కూడా ఇయర్ ఎండింగ్ కి వస్తుందని టాక్. సో ఈ ఇయర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు రెండు సినిమాలతో అదిరిపోయే ట్రీట్ అందిస్తారని చెప్పొచ్చు.    


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.