ఫాధర్ పాత్ర ప్రభాస్ వేసేస్తున్నాడా?

Sun May 16 2021 18:00:02 GMT+0530 (IST)

Is Prabhas playing the role of Father

అప్పుడప్పుడూ తండ్రి కొడుకుల పాత్రలు హీరోలు వేసేస్తూంటారు. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ఏ ఎన్నార్కృష్ణ వంటి వాళ్లు వాళ్ల సినిమాల్లో ఇలా రెండు పాత్రలు వేసి చెలరేగిపోయేవాళ్లు. కమల్ హాసన్ భారతీయుడు లాంటి పాత్రలు అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఎందుకనో ఆ తర్వాత తరం దాన్ని అందిపుచ్చుకోలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్ కూడా అలా తండ్రికొడుకు పాత్రల్లో కనిపించబోతున్నారట. ముఖ్యంగా తండ్రి పాత్రను బాగా డిజైన్ చేసారట. ఇంతకీ ఏ సినిమాలో అంటారా..సలార్ మూవిలో అని చెప్తున్నారు.ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ మూవీ గురించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడనే టాక్ ఇప్పటికే ఉంది. ఆ రోల్స్ లో ప్రభాస్ తండ్రి కొడుకులుగా కనిపిస్తారని రెండు వేర్వేరు లుక్స్ లో ప్రభాస్ ఫాన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్నాడని ఇప్పుడు తాజా ఖబర్. ఇప్పటికే సలార్ లో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది. అది తండ్రి క్యారక్టర్ దే అంటున్నారు.

ప్రభాస్ తండ్రి పాత్రకి సంబంధించిన ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని.. ఈ సినిమాలో ప్రభాస్ ఫాదర్ రోల్ చేస్తున్న ప్రభాస్ ఓ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని వినిపిస్తోంది. ఆర్మీ ఆఫీసర్ లుక్ లో ప్రభాస్ అదిరిపోతాడని అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే యుద్ధ సన్నివేసాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందేనేది తెలియాల్సి ఉంది. ఈ న్యూస్ నిజమే అయితే ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకోవటం ఖాయం.

ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలిసిన దగ్గర నుంచి అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ రెండు విభిన్నమైన లుక్స్ లో ప్రభాస్ ను చూడటానికి వాళ్లంతా ఆత్రుత పడుతున్నారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.