ప్రభాస్ కు వాటిపై బోర్ కొట్టిందా?

Fri Feb 21 2020 12:45:16 GMT+0530 (IST)

Is Prabhas Bored On Vfx Works ?

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీని చేస్తున్న విషయం తెల్సిందే. 1980 నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండొద్దని దర్శకుడికి ప్రభాస్ చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. బాహుబలి.. సాహో చిత్రాల్లో ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ వల్ల సినిమా రియాల్టీకి కాస్త దూరంగా ఉంటుందని ప్రభాస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాలో ఎక్కువగా నాచురల్ సీన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అతి తక్కువ విజువల్ ఎఫెక్స్ సీన్స్ ఉండాలని దర్శకుడికి మొదట్లోనే ప్రభాస్ చెప్పాడట. దాంతో కాస్త ఎక్కువ సమయం తీసుకుని నాచురల్ గా సినిమా తీస్తున్నట్లుగా యూనిట్ వర్గాల వారు చెబుతున్నారు. ఈమద్య కాలంలో ప్రతిదానికి గ్రాఫిక్స్ వాడుతున్నారు. అలాంటిది ప్రభాస్ మాత్రం గత సినిమాలకు ఎక్కువగా గ్రాఫిక్స్ సీన్స్ చేయడం వల్ల అవి అంటేనే బోర్ కొట్టినట్లున్నాయి.

ఈ ఏడాది చివరి వరకు అయినా ఈ సినిమాను విడుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణంరాజు మరియు మిథున్ చక్రవర్తి ఇంకా పలువురు బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.