పవన్ ఆ రీమేక్ ని కూడా పట్టాలెక్కిస్తున్నాడా?

Mon Jan 23 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Is Pawan Kalyan to Start Another Remake Film

టాలీవుడ్ లో వురన్న టాప్ హీరోల్లో ఓ పక్క ఏపీ రాజకీయాలు మరో పక్క వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తున్న హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో 'హరి హర వీరమబల్లు' మూవీలో నటిస్తున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మరో నిర్మాత ఏ.దయాకర్ రావుతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో వుంది.నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని 17వ శతాబ్ద కాలం నాటి మొగల్ సామ్రాజ్యంలోని కోహీనూర్ వజ్రం నేపథ్యంలో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో పీరియాడికల్ మూవీగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. బాబీడియోల్ నర్గీస్ ఫక్రీ ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ అండర్ ప్రొడక్షన్ లో వుండగానే పవన్ కల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే.

క్రేజీ డైరెక్టర్ లతో భారీ ప్రాజెక్ట్ లని ప్రకటిస్తూ ఫ్యాన్స్ కి పవన్ షాకుల మీద షాకులిస్తున్నాడు. 'సాహో' హెమ్ సుజీత్ డైరెక్షన్ లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ ఓ విభిన్నమైన గ్యాంగ్ స్టార్ స్టోరీతో ఓ మూవీకి గత ఏడాది చివర్లో పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టడం ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేయడం తెలిసిందే. ఇక గత కొంత కాలంగా పవన్ కోసం ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్'ని లాంఛనంగా ప్రారంభించారు.

పూజా కార్యక్రమాలు కూడా జరిపారు.. కానీ ఇంత వరకు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైందా? .. మొదలు కానుందా? వంటి వివరాలేవీ బయటికి రాలేదు. చిత్ర బృందం కూడా వెల్లడించలేదు. సుజీత్ మూవీ అనౌన్స్ మెంట్ వరకే పరిమితం కాగా హరీష్ శంకర్ సినిమా కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడట. త్వరలో పవన్ మరో రీమేక్ ని సైలెంట్ గా మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.

సముద్రఖని నటించి తెరకెక్కించిన 'వినోదాయ సితం' మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ మూవీని నిర్మించబోతున్నారు.

త్రివిక్రమ్ స్క్రిప్ట్ పర్యవేక్షణ డైలాగ్స్ బాధ్యతల్ని తీసుకున్నారట. మూహూర్తం షాట్ లు అంటూ ఏమీ లేకుండానే ఈ రీమేక్ ని సైలెంట్ గా పట్టాలెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమాలో పవన్ దైవదూత పాత్రలో కనిపించనుండగా కీలక పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నాడు.     నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.