Begin typing your search above and press return to search.
పవన్ ఫ్యాన్స్ కి మరో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?
By: Tupaki Desk | 27 Jan 2023 4:00 PMపవర్ స్టార్‌పవన్ కల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వాటిని మొదలు పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ క్రియాశీలక రాజకీయాల్లో బిజీగా గడిపేస్తూనే మరో పక్క వరుస సినిమాలని లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇటీవలే రాజకీయ ప్రచారం కోసం వారాహిని రెడీ చేయించి దానకి కొండగట్టుతో పాటు విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించిన విషయం తెలిసిందే.
క్రిష్ జాగర్లమూడితో చేస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు'ని పూర్తి చేసే పనిలో వున్న పవన్ ఇది పూర్తి కాకుండానే వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లని ప్రకటిస్తూ అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఇటీవలే 'భవదీయుడు భగత్ సింగ్' ప్లేస్ లో 'తేరీ' రీమేక్ ఆధారంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఆ వెంటనే 'సాహో' ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో ఓ భారీ గ్యాంగ్ స్టర్ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా ప్రీ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.
డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ భారీ గ్యాంగ్ స్టర్ మూవీని నిర్మించబోతున్నారు. అరుణవర్ణమైన పోస్టర్ .. మధ్యలో సూరీడు.. దే కాల్ హిమ్ ఓజే' అనే ట్యాగ్ లైన్... జపాన్ టు ముంబై కి సంబంధించిన సింబల్స్.. మధ్యలో పవన్ షాడో.. గన్ ని తలపిస్తూ కనిపించిన తీరుతో ప్రీ లుక్ పోస్టర్ తో పవన్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు.
పోస్టర్ ఎడ్జ్ లో ఫర్ స్టోర్మ్ ఈజ్ కమింగ్ అంటూ చిన్న క్యాప్షన్ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరపైకి రానుందని, ఇందులో పవన్ ని సుజీత్ ఓ రేంజ్ లో ప్రజెంట్ చేయబోతున్నాడని సంబరాలు జరుపుకున్నారు.
పవన్ కు స్వతహాగా వీరాభిమాని అయిన సుజీత్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో వున్నాడట. అంతే కాకుండా తన కెరీర్ కు అత్యంత ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ గానూ, దర్శకుడిగా తన కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రాజెక్ట్ గానూ భారీ అంచనాలే పెట్టుకున్నాడని చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీని ప్రకటించి దాదాపు నెల దాటి పోయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి సర్ ప్రైజ్ అప్ డేట్ రాబోతోంది.
ఈ మూవీని జనవరి 30న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో నటించే హీరోయిన్, విలన్ గా ఎవరిని దించబోతున్నారు అనే పూర్తి వివరాలు ఆ రోజే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించబోతోందని, పవన్ , సుజీత్ ల కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో భారీ స్‌థాయిలో నిర్మించబోతున్నారని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.