పఠాన్ మల్టీవర్స్ ట్రెండ్ కి మరింత ఊతమిస్తోందా?

Fri Jan 27 2023 17:00:01 GMT+0530 (India Standard Time)

Is Pathan giving more to the multiverse trend?

బాలీవుడ్ కింగ్ ఖాన్ హీరో షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ 'పఠాన్'. బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. దేశం కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టే స్పై యాక్షన్ థ్రిల్లర్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు. గత కొంత కాలంగా వరుస డిజాస్టర్ లతో వందల కోట్లు పోగొట్టుకుంటూ వస్తున్న ప్రఖ్యాత యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీని ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేశారు.దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం షారుక్ ఖాన్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. గత కొంత కాలంగా బాలీవుడ్ బిగ్ స్టార్స్ సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోతుండటం.. బాలీవుడ్ మార్కెట్ ప్రేక్షకులు కూడా హిందీ సినిమాపై స్థబ్దంగా వుండటంతో ఈ మూవీతో అయినా బాలీవుడ్ భవితవ్యం మారుతుందా? అనే ఆసక్తి అందరిలోనూ కనిపించింది. ఈ అంచనాల మధ్య విడుదలైన 'పఠాన్' అనూహ్య విజయాన్ని సాధించిన బాలీవుడ్ కు సరికొత్త ఊపిరి అందిస్తోంది.

ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లే ఇందుకు ప్రధాన నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇదిలా వుంటే 'పఠాన్' బ్లాక్ బస్టర్ హిట్ తో మల్టీవర్స్ మూవీస్ కి మరింత ఊతం లభించినట్టుగా తెలుస్తోంది. మల్టీవర్స్ లో భాగంగానే ఇందులో సల్మాన్ ఖాన్ టైగర్ గా కనిపించి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో లోకేష్ కనగరాజ్ 'విక్రమ్' మూవీని కూడా మల్టీవర్స్ ప్రపంచం నేపత్యంలో తెరకెక్కించడం తెలిసిందే.  ఈ మూవీలో 'ఖైదీ'ని యాడ్ చేశాడు. ఈ మూవీలోని కీలక సన్నివేశంలో కార్తీ కనిపించడంతో ఇది కూడా మల్టీవర్స్ నేపథ్యంలో రూపొందినట్టుగా క్లారిటీ వచ్చేసింది.

త్వరలో ప్రారంభం కానున్న విజయ్ 67 ఖైదీ 2 సినిమాలు కూడా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నాయని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేఫథ్యంలో సినిమాటిక్ మల్టీవర్స్ స్టోరీతో 'పఠాన్' తెరకెక్కడం.. రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తుండటంతో మల్టీవర్స్ సినిమాకు 'పఠాన్' ఊతమిచ్చినట్టుగా తెలుస్తోంది. ఆడియన్స్ ఈ తరహా సినిమాపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారని స్పష్టమైంది.

ఇదే ఊపులో 'వార్ 2' ని కూడా ఇందులో ఇన్ వాల్వ్ చేస్తూ సల్మాన్ ఖాన్  టైగర్ 3 ని కూడా  ఇదే స్పై యూనివర్స్ నేపథ్యంలో తెరపైకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇక దక్షిణాది సినిమాల విషయానికి వస్తే 'కేజీఎఫ్' సలార్ సినిమాలు కూడా మల్టీవర్స్ నేఫథ్యంలో రూపొందబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ 'సలార్'లో రాఖీభాయ్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడట. వీటి స్ఫూర్తితో మరిన్ని మల్టీవర్స్ నేపథ్య సినిమాలు తెరపైకి రావడం ఖాయంగా కనిపిసతోందిని ఇన్ సైడ్ టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.