Begin typing your search above and press return to search.

వామ్మో మనోళ్ల టార్గెట్ ఆస్కారేనా..?

By:  Tupaki Desk   |   31 March 2023 4:00 PM GMT
వామ్మో మనోళ్ల టార్గెట్ ఆస్కారేనా..?
X
ఆస్కార్ ఏమైనా అంగట్లో దొరుకుతుందా ప్రతి ఒక్కరికి దొరకడానికి.. అది రావాలంటే ఎంతో ప్రతిభ.. దానికి తగిన గుర్తింపు దొరకాల్సిందే. ఎన్నో ఏళ్లుగా మనం ఆస్కార్ కోసం ప్రయత్నిస్తుంటే అది మన నాటు సాంగ్ కి ఆస్కారం లభించింది. ప్రతి తెలుగు వాడి కలను సాకారం చేసేలా చేసింది నాటు నాటు పాట. అయితే ఒకసారి ఆస్కార్ వచ్చింది కదా అని ప్రతి సినిమా ఆస్కార్ టార్గెట్ చేస్తున్నారట మన స్టార్ హీరోలు. ఒక సినిమాకు అది కూడా నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చిందో లేదో స్టార్ హీరోలంతా ఇప్పుడు తమ సినిమాలన్నీ ఆస్కార్ టార్గెట్ తోనే చేస్తున్నారని టాక్.

సినిమా బడ్జెట్ పెంచడమే కాదు ఐకానిక్ సాంగ్.. మేకింగ్ ఇలా అన్నిటిలో ఫస్ట్ క్లాస్ టేకింగ్ ఉండాలని కోరుతున్నారట. ఇక సినిమా రిలీజ్ ప్రమోషన్స్ ప్లానింగ్ కూడా వరల్డ్ వైడ్ హడావిడి చేయాలని చెబుతున్నారట. RRR సినిమా పాటకు ఆస్కార్ వచ్చింది అంటే దాని వెనక రాజమౌళి కష్టం అందరికీ తెలిసిందే.

దర్శకుడిగా రాజమౌళి, హీరోలుగా చరణ్, తారక్ సంగీత దర్శకుడు కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్, సింగర్స్ ఇలా అందరు ఒక సాంగ్ కు ప్రాణం పోశారు కాబట్టే అది ఆస్కార్ దాకా వినిపించింది.

ఆస్కార్ టార్గెట్ తో సినిమా చేయాలని అనుకోవడం తప్పు కాదు కానీ ప్రతి సినిమా ఆస్కార్ లెవల్లో ఊహించేసుకొని అనవసరమైన ఖర్చులు చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే అని చెప్పొచ్చు.

ఆస్కార్ అవార్డు మన హీరోలకు ఇచ్చిన ఉత్సాహం బాగానే ఉన్నా ఆస్కార్ అంటే అదేదో ఈజీగా వచ్చే అవార్డు అనుకుంటే మాత్రం పొరబడినట్టే. ఒక సినిమా అకాడమీ అవార్డుల రేంజ్ కి వెళ్లే స్థాయి ఉండాలి అంటే వరల్డ్ ఆడియన్స్ అంతా ముక్త కంఠంతో సినిమా గురించి చర్చించుకునేలా చేయాలి.

ఆ స్థాయి ఉన్నప్పుడు మాత్రమే ఆస్కార్ అవార్డుల దాకా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటివరకు మన సినిమాలు ఆస్కార్ నామినేట్ అయితేనే గొప్ప అనుకుంటుంటే ఒక్క అవార్డు వచ్చే సరికి ప్రతి హీరో సినిమా ఆస్కార్ టార్గెట్ తో చేయడం మాత్రం విడ్డూరంగానే అనిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.