Begin typing your search above and press return to search.

నితిన్.. ఓ సైతాన్!

By:  Tupaki Desk   |   22 March 2023 2:00 PM GMT
నితిన్.. ఓ సైతాన్!
X
యంగ్ అండ్ డైనమిక్ హీరో నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల నటించబోతోంది. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకాలపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత హరీష్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సాయిరాం సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. వక్కంతం వంశీ, హీరో నితిన్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రానికి సైతాన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

గతంలో ఈ చిత్రానికి జూనియర్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం సైతాన్ అనే పేరు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా టైటిల్ అనేది చాలా ముఖ్యం. అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో చిత్రంపై బజ్ పెంచాలంటే ముందుగా టైటిల్ ను ఖరారు చేయడం చాలా ముఖ్యమని భావించిన చిత్రబృందం ఈ పనిలో పడ్డట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు షార్ట్ లిస్ట్ చేసిన టైటిల్స్ లో ఇదే బెటర్ అని అంతా భావిస్తున్నట్లు సమాచారం. సైతాన్ అనేది నెగటివ్ వర్డ్ గా అనిపిస్తోందా... బాగానే ఉందా అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్ పుట్టిన రోజు నాడు ఈ సినిమా టైటిల్ ను ప్రకటించబోతున్నట్లు సినీ విశ్లేశకులు అంచనా వేస్తున్నారు. అధికారికంగా ఈ విషయం ప్రకటించే వరకు ఆగితే తప్ప అసలు విషయం తెలిసేలా లేదు.

అయితే ఇటీవలే మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్.. పరాజయం పాలయ్యాడు. ఈ క్రమంలోనే వస్తే మంచి హిట్టుతో రావాలనే కసితో ఉన్నాడు. అలాగే డైరెక్టర్ వక్కంతం వంశీ కూడా తన మొదటి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు.

తన రెండో సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే స్టోరీని చాలా బాగా రాసుకున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఫుల్లు కసిమీద ఉన్న వీరిద్దరూ ఏ రేంజ్ లో హిట్టు కొడతారో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.