Begin typing your search above and press return to search.
మెగాస్టార్ ని ఫాలో అవుతున్న కింగ్!
By: Tupaki Desk | 1 Feb 2023 6:00 AMసీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ కు బ్యాక్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల విరాం తరువాత మెగాస్టార్ 'కత్తి' రీమేక్ ఆధారంగా తెరకెక్కిన 'ఖైదీ నంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. తన సెకండ్ ఇన్నింగ్స్ కి ఈ మూవీతో శ్రీకారం చుట్టారు. పదేళ్లు గ్యాప్ తీసుకున్నా సరే స్రేక్షకుల్లో చిరు పట్ల క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ సినిమా వసూళ్లు నిరూపించాయి. ఆ తరువాత చేసిన 'సైరా నరసింహారెడ్డి'లో చాలా వరకు ఇతర భాషల స్టార్స్ నటించారు.
కీలక అతిథి పాత్రలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి కనిపించిన విషయం తెలిసిందే. ఆ మూవీ నుంచి తన ప్రతీ సినిమాలో ఎవరో ఒకరు స్టార్ వుండేలా చూసుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. కొరటాల శివ తెరకెక్కించిన 'ఆచార్య'లో రామ్ చరణ్‌ఖ కీలక అతిథి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత చిరు నటించిన 'గాడ్ ఫాదర్' లోనూ ఇదే పరిస్థితి. బాలీవుడ్ క్రేజీ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించగా యంగ్ హీరో సత్యదేవ్ విలన్ గా కనిపించాడు.
ఇక రీసెంట్ గా బాబి డైరెక్షన్ లో చేసిన 'వాల్తేరు వీరయ్య'లో మాస్ మహారాజా రవితేజ కీలక అథితి పాత్రలో నటించి సినిమాకు ప్రధాన బలంగా నిలవడం తెలిసిందే. ఇద్దరి క్యారెక్టర్స్ పవర్ ఫుల్ గా కుదరడంతో సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది.
ఇప్పటి వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడం విశేషం. ఇప్పుడు మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఇదే తరహాలో చిరుని ఫాలో కాబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
'వైల్డ్ డాగ్' మూవీ నుంచి నాగార్జున్ హిట్ అనే మాట వినడం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఏదీ పెద్దగా ఆడటం లేదు. రీసెంట్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించిన 'ది ఘోస్ట్' అయినా నాగ్ కు సక్సెస్ ని అందిస్తుందని అంతా భావించారు. ఇది కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఈ నేపత్యంలో కింగ్ నాగార్జున ఇకపై చిరు తరహాలోనే తను చేయబోయే సినిమాల్లో మరో హీరోతో కలిసి నటించాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే 'గాడ్ ఫాదర్' ఫేమ్ మోహన్ రాజా డైరెక్షన్ లో చేయనున్న 100వ మూవీని మల్టీస్టారర్ గా చేయబోతున్నారట. ఇందులో అఖిల్ కీలక అతిథి పాత్రలో నటించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీతో పాటు 'ధమాకా' రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ మూవీ చేయబోతున్నారట. దీనికి శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించనున్నారని, ఇందులోనూ కీలక పాత్రలో ఓ హీరో నటించనున్నాడని తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.