ఎన్టీఆర్ ప్రయోగానికి రెడీ అవుతున్నారా?

Tue Apr 05 2022 15:09:32 GMT+0530 (India Standard Time)

Is NTR Getting Ready for the experiment?

స్టోరీ క్యారెక్టర్ నచ్చితే స్టోరీ డిమాండ్ మేరకు మన స్టార్ లు ఎలాంటి పాత్రల్లో అయినా నటించడానికి ఇమేజ్ని పక్కన పెట్టి ప్రయోగాత్మక చిత్రాల్లో.. పాత్రల్లో నటించడానికి వెనుకాడటం లేదు. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'ట్రిపుల్ ఆర్'. ఈ మూవీ రిలీజ్ కోసం దాదాపుగా మూడున్నరేళ్లు ఎదురుచూసిన ఎన్టీఆర్ ఎట్టకేలకు మార్చి 25న వరల్డ్ వైడ్ గా విడుదల కావడంతో తదుపరి చిత్రాలపై దృష్టిపెట్టారు. గత మూడున్నరేళ్లుగా ఒకే సినిమా కోసం కేటాయించిన ఎన్టీఆర్ ఇప్పడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలని సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నారు.'ట్రిపుల్ ఆర్' తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. జూన్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. క్రేజీ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్ గా నటించే అవకాశం వుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు ఎన్టీఆర్ మరో చిత్రాన్ని అంగీకరించారు. 'ఉప్పెన' చిత్రంతో దర్శకుడిగా ప్రశంసల్ని సొంతం చేసుకున్న బుచ్చిబాబు సానాతో ఎన్టీఆర్ ఓ మూవీని చేయబోతున్నారు. 1980 వ దశకం నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీగా రూపొందనుందట. సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త అవతారంలో కనిపించే అవకాశం వుందని స్టోరీ డిమాండ్ మేరకు ఎన్టీఆర్ ఇందులో దివ్యాంగుడిగా కనిపించ నున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే కథకు కీలకంగా నిలిచే ఓ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ దివ్యాంగుడిగా కనిపిస్తారని ఇదే ఈ మూవీకి ప్రధాన హైలైట్ అంశం అని చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఆ కీలక ఘట్టంలో దివ్యాంగుడిగా కనిపిస్తే అభిమానుల రియాక్షన్ ఏంటీ? . వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని పై ప్రస్తుతం ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరపైకి తీసుకురావాలని దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేసిన బుచ్చిబాబు హీరో ఎన్టీఆర్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారట. వన్స్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేయాలన్నది బుచ్చిబాబు ఆలోచన.

స్టార్ డైరెక్టర్ కొరటలా శివతో చేయనున్న భారీ చిత్రం పూర్తయిన తరువాతే ఎన్టీఆర్ .. బుచ్చిబాబు సినిమాకు డేట్స్ కేటాయిస్తారట. మరి ఎన్టీఆర్ నిజంగానే దివ్యాంగుడి పాత్రలో నటిస్తారా? .. లేక ఇది ప్రచారమేనా అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.