Begin typing your search above and press return to search.

తెలుగు వారిని లైట్ తీసుకుంటున్న మణిరత్నం

By:  Tupaki Desk   |   22 March 2023 5:00 AM GMT
తెలుగు వారిని లైట్ తీసుకుంటున్న మణిరత్నం
X
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ - 1 ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా తమిళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఈ సినిమా డబ్బింగ్ తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన డిజాస్టర్ కాగా, ఉత్తరాదిలో హిందీ వెర్షన్ కూడా అదే విధంగా దారుణమైన ఫలితాలు అందుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాని తెలుగులో పెద్దగా ప్రమోట్ చేయలేదు. ఆ దెబ్బతో ఈ సినిమాకి తెలుగులో ఫలితం కూడా అదే విధంగా దారుణంగా వచ్చింది.

ఈ సినిమాకి సంబంధించిన రెండవ భాగం ఏప్రిల్ 28న విడుదలవుతోంది. ఈ రెండో భాగం సినిమా కూడా తమిళనాడులో మొదటి భాగం నెలకొల్పిన రికార్డులను బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

కానీ ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ వెర్షన్‌ల గురించి ఏమాత్రం అంచనా వేయలేమని ట్రేడ్ వర్గాల వారు తేల్చి చెప్పారట. నిజానికి ముందు నుంచి తమిళ సినిమాలకు తమిళనాట తర్వాత తెలుగు మార్కెట్ బెస్ట్ గా పరిగణించ బడుతుంది.

గతంలో చాలా తమిళ సినిమాలు తమ తెలుగు డబ్బింగ్ వెర్షన్లలో నమ్మశక్యం కాని బిజినెస్ చేశాయి, అదే రేంజ్ లో వసూళ్లు కూడా రాబట్టుకున్నాయి. వాస్తవానికి, తమిళంలో ఫ్లాప్‌లు కూడా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లలో మంచి బిజినెస్ చేసి ఖర్చులను రికవరీ చేయడంలో సహాయపడాయి. కానీ నిర్మాతలు పీఎస్: 2 తెలుగు మార్కెట్‌ను ఎలా డెవలప్ చేయాలనే విషయం మీద పూర్తిగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

తమిళంలో అతిపెద్ద సీక్వెల్‌గా పరిగణించబడుతున్న PS 2లో తెలుగులో మంచి క్రేజ్ ఉన్న విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ వంటి నటినటులు చాలా మంది ఉన్నారు. అయినా ఈ సినిమాలు తెలుగులో ప్రమోట్ చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపించడం లేదు.

మొదటి భాగం సినిమాని తెలుగు ప్రేక్షకులు పూర్తిగా విస్మరించిన నేపథ్యంలో రెండో భాగానికి కూడా అదే ఫలితం రావచ్చనే ఉద్దేశంతో నిర్మాతలు ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.