విజయ్ కోసం కమల్ ను వాడేస్తున్నారా?

Tue Jan 24 2023 11:09:00 GMT+0530 (India Standard Time)

Is Kamal Hassan in Thalapathy 67 Film

దళపతి విజయ్ కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న ఆర్మార్క్స్ మీడియా సంస్థ విడుదల చేసిన లిస్ట్లో కూడా ఆయన పేరు ముందు వరుసలో ఉంది. ఆయనను దేవుడుగా కొలిచే కొందరు అభిమానులు కూడా ఉన్నారంటే.. ఏమాత్రం అతిశయోక్తి కాదు.ఇటీవల తన 66వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ప్రేక్షకులను అలరించాడు. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిసు అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

 విజయ్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. శ్రీకాంత్ కిక్ శ్యామ్ జయసుధ శరత్ కుమార్ ప్రకాష్ రాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా జనవరి 11వ తేదీన తమిళంలో... జనవరి 14వ తేదీన తెలుగులో విడుదలైంది. ఈ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా విజయ్ 67వ సినిమా గురించి మరో అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే  లోకేష్ కనకరాజు గతంలో చేస్తూ వస్తున్న వరుస సినిమాల లింకుతోనే ఈ సినిమా కూడా ఉంటుందని అంటున్నారు. లోకేష్ కనకరాజు ముందుగా ఖైదీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు. దానికి కొనసాగింపుగా విక్రమ్ అనే సినిమా కూడా చేశారు. అయితే ఇప్పుడు విజయ్తో తీయబోయే సినిమా కూడా విక్రమ్ సినిమాకు లింక్ ఉంటున్నట్లు తెలుస్తోంది.

విక్రమ్ సినిమాలో క్లైమాక్స్ లో సూర్య ఎంట్రీ ఎలా ఉంటుందో... ఇదే తరహాలో విజయ్ 67వ సినిమాలో కమల్ హాసన్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఒకవేళ అదే గనుగ జరిగితే... థియేటర్లలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం ఖాయం.

కమల్ హాసన్ విజయ్ ని ఒకే స్క్రీన్పై చూస్తే.. ప్రేక్షకులకు పూనకాలు రావాల్సిందే. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన లేకపోయినా తమిళ మీడియా వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది.     నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.