Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్' హీరోకి ఇన్ సెక్యూరిటీనా..?

By:  Tupaki Desk   |   5 March 2021 3:30 AM GMT
కేజీఎఫ్ హీరోకి ఇన్ సెక్యూరిటీనా..?
X
కన్నడ రాకింగ్ స్టార్ యష్ 'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య జులై 16న ఈ సినిమా విడుదల కానుంది. అయితే యష్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ని చూసి ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తన క్రేజ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తనకు పోటీగా ఉన్న ప్రభాస్ విష‌యంలో య‌శ్ ఇన్ సెక్యూర్ ఫీలై, ప్రశాంత్ నీల్ మీద ప్రెజ‌ర్ పెడుతున్నాడ‌ని ఈ మ‌ధ్య వార్తలు తెగ వినిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం ప్రభాస్ - య‌శ్ ఇద్ద‌రు ఫుల్ ఫ్రెండ్ షిప్ లో ఉన్నారని.. య‌శ్ మీద ఇలా నెగిటివ్ ప్ర‌చారం చేయడం స‌రికాద‌ని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. నిజానికి ప్రభాస్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ''సలార్'' సినిమా ప్రారంభోత్సవానికి యష్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అలానే ఇటీవల 'స‌లార్' షూటింగ్ స్పాట్ కి య‌శ్ వెళ్లి ప్రభాస్ ని కలిసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి చిల్ అవుతున్నారనడానికి ఇదే నిదర్శనమని యష్ ప్రతినిధులు అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం యష్ ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాడు కాబట్టే ఇలా ప్రభాస్ తో మీట్ అవుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.