దసరాలో అతనికి అన్యాయం జరిగిందా..?

Fri Mar 31 2023 12:03:27 GMT+0530 (India Standard Time)

Is Injustice Happened to Him in Dasara

దసరా సినిమా తెలుగులో సందడి షురూ చేస్తుండగా సినిమాలో అది బాగుంది ఇది బాగాలేదు అనే విశ్లేషణలు జరుగుతున్నాయి. సినిమాను కొంతమంది ఆడియన్స్ సూపర్ అంటున్నా చాలామంది మాత్రం జస్ట్ ఓకే అంటున్నారు. సినిమాకు ఫైనల్ గా మిక్సెడ్ టాక్ వచ్చేసింది. అలా ఎందుకు అంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే నడిపించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సెకండ్ హాఫ్ మాత్రం ట్రాక్ తప్పాడు. ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేసినట్టుగా సెకండ్ హాఫ్ చేయలేకపోయాడు. అయితే క్లైమాక్స్ కి మళ్లీ సెట్ రైట్ అయ్యాడు. ఇదే టాక్ బయట కూడా నడుస్తోంది.అంతేకాదు సినిమాలో సముద్రఖని పాత్రకి కేవలం ఒకటి రెండు డైలాగ్స్ మాత్రమే ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న నటుడు ఈమధ్య పవర్ స్టార్ పవన్ సినిమాను డైరెక్ట్ కూడా చేస్తున్నాడు ఆయన.

ఈమధ్య విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బాగానే హడావిడి చేస్తున్నాడు సముద్రఖని అలాంటిది ఆయన్ను కేవలం సినిమా మొత్తం మీద ఒక్క డైలాగ్ తో సరిపెట్టడం నిరాశపరచింది. ఆ పాత్ర అంత తక్కువ మాట్లాడుతుంది అన్నప్పుడు అంత వెయిట్ ఉన్న ఆర్టిస్ట్ ని ఎందుకు పెట్టారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది.

సినిమా నాని ఫ్యాన్స్ కి వావ్ అనిపిస్తున్నా.. జనరల్ ఆడియన్స్ మాత్రం సినిమా కొన్ని సినిమాలన్ని కలిపి కొట్టినట్టుగా కథ ఉందని అంటున్నారు. మేకింగ్ పరంగా దర్శకుడికి మార్కులు పడుతున్నా సినిమా విషయంలో చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెబుతున్నారు. సినిమాలో నాని ఒక్కడే డిఫరెంట్ గా కనిపించాడు. అంతే తప్ప ఇదేమి అద్భుతమైన కథేమి కాదని అనుకుంటున్నారు.

ఒక సినిమా రిలీజైతే సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. దసరా సినిమాకు కూడా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సినిమా కంప్లీట్ హిట్ అని చెప్పలేకపోతున్నారు కొందరు.

అయితే నాని రేంజ్ కి ఇది చాలా ఎక్కువే సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంటున్న వారు ఉన్నారు. కానీ అసలు విషయం ఏంటి అంటే సినిమా హిట్ అంటున్న వారి కన్నా సినిమా జస్ట్ ఓకే అన్న వారే ఎక్కువమంది ఉన్నారు.       


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.