నేచురల్ స్టార్ కు 'హిట్ 3' సవాలేనా?

Fri Dec 02 2022 18:02:04 GMT+0530 (India Standard Time)

Is Hit 3 a challenge for the natural star Nani

సక్సెస్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ కు ఫ్రాంచైజీగా రూపొందిన మూవీ `హిట్ 2`. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించగా శైలేష్ కొలను తెరకెక్కించిన `హిట్ 2`పై మొదటి నుంచి అంచనాలున్నాయి. ఆ అంచనాల నేపథ్యంలో ఈ శుక్రవారం హిట్ 2 థియేటర్లలోకి వచ్చేసింది.ముందు నుంచి ఈమూవీకి సీక్వెల్ గా `హిట్ 3`లో ఎవరు నటించనున్నారనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ మూవీ ఎండింగ్ లో నాని `హిట్ 3`లో హీరోగా నటిస్తున్నట్టగా క్లారిటీ ఇచ్చేశారు.

హిట్ హిట్ 2లతో నిర్మాతగా వరుసగా విజయాల్ని దక్కించుకున్న నాని `హిట్ 3`ని తానే చేస్తున్నట్టుగా క్లారిటీ ఇవ్వడం.. సినిమా క్లైమాక్స్ లో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడంతో అంతా పార్ట్ 3పై భారీగానే అంచనాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. విశ్వక్ సేన్ తో చేసిన `హిట్` కు మంచి ఆదరణ లభించిడం.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు దక్కడంతో `హిట్ 2` పై కూడా అదే స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే అడివి శేష్ నటించిన `హిట్ 2` మాత్రం ఆశించిన స్థాయిలో బ్లాస్టింగ్ హిట్ గా అనిపించుకోలేకపోయింది. రిలీజ్ కు ముందున్న క్రేజ్ కు తగ్గ స్థాయిలో మాత్రం సినిమా లేదన్నది ప్రేక్షకులు చెబుతున్న మాట. దీని వల్ల నిర్మాతగా నానికి పోయింది ఏమీ లేదు కానీ దీని ఎఫెక్ట్ `హిట్ 3`పై గట్టిగా పడే అవకాశం మాత్రం వుంది. `హిట్ 2` క్లైమాక్స్ లో నాని కనిపించడంతో ప్రేక్షకుల కేరింతలకు హద్దే లేకుండా పోయింది.

అయితే ఆ అంచనాలని `హిట్ 3`తో నాని అందు కోవడం సవాలే అని చెప్పక తప్పదు. కారణం సీరియస్ సినిమాలతో నాని ఆకట్టుకోలేడని `వి` సినిమా నిరూపించింది. ఆ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకని `హిట్ 3`ని మరింత కొత్త గా మలిస్తే తప్ప నాని `హిట్ 3`తో ప్రేక్షకులని ఆకట్టుకోవడం కష్టమే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.