పవన్ కోసం హరీష్ అలాంటి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడా...?

Sun Aug 02 2020 16:00:42 GMT+0530 (IST)

Is Harish preparing such a script for Pawan ...?

టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్ ''గబ్బర్ సింగ్'' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అప్పటి వరకు వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్ కల్యాణ్ కి.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఈ చిత్రంతో ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ఇండస్ట్రీని కూడా షేక్ చేశాడు. పవన్ కళ్యాణ్ గెటప్ లుక్స్ డైలాగ్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన హరీష్ 'గబ్బర్ సింగ్' అంతటి ఘన విజయం సాధించడంలో భాగం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కలయికలో మరో సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ కెరీర్లో 28వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. పవన్ - హరీష్ కాంబోలో సినిమా అనౌన్స్ చేసిన వెంటనే గాల్లో తేలిపోయారు అభిమానులు. 'గబ్బర్ సింగ్' రిజల్ట్ మళ్లీ రిపీట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసేశారు. ఈ నేపథ్యంలో వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హరీష్ శంకర్ స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కాగా హరీష్ - పవన్ చేయబోతున్న సినిమా కూడా పోలీస్ కథతోనే తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. 'గబ్బర్ సింగ్'లో పవన్ కళ్యాణ్ ని పవర్ ఫుల్ పోలీసుగా చూపించిన హరీష్ మరోసారి అదే నేపథ్యాన్ని ఎంచుకున్నాడని ఫిలిం సర్కిల్స్ లో డిస్కస్ చేసుకుంటున్నారు. దీంతో పవన్ అభిమానులు కూడా హరీష్ ప్రాజెక్ట్ పై పూర్తి నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని జోడించి పకడ్బందీగా ఈ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడట హరీష్. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' మరియు కక్రిష్ జాగర్లమూడి సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.