పెళ్లి తర్వాత బిఫోర్ మ్యారేజ్ ఉన్నంత ఫ్రీడమ్ కొందరికి ఉండదు! కానీ ఇటీవలి కాలంలో అందాల కథానాయికలు పెళ్లి తర్వాత కెరీర్ ని కొనసాగిస్తూ వర్క్ లైఫ్ ని ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేయడాన్ని ఇష్టపడుతున్నారు. అలాంటి జాబితాలో హన్సిక పేరు కూడా ఉందా? అంటే ఇదిగో ఇదే పక్కా ప్రూఫ్. ఇటీవల పెళ్లి తర్వాత ఆపిల్ బ్యూటీ హన్సిక ఎంతో ఆనందంగా సెలబ్రేషన్ మోడ్ లో కనిపిస్తోంది. లైఫ్ లో ప్రతి క్షణాన్ని ఎంతో మెమరబుల్ గా మలుచుకుంటోంది. భర్తతో కలిసి విదేశీ విహారాలతో ఫుల్ జాయ్ ఫుల్ గా కనిపిస్తున్న హన్షిక వరుసగా వెకేషన్ నుంచి ఫోటోలు వీడియోలను షేర్ చేస్తోంది. తాజా వెకేషన్ నుంచి కొన్ని ఫోటోలను హన్సిక షేర్ చేయగా అవి అంతర్జాలంలో దుమారం రేపుతున్నాయి.
లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ లో వైట్ టాప్- పింక్ బాటమ్ ను ధరించిన హన్షిక 90 డిగ్రీస్ కోణంలో తన భంగిమను షేర్ చేసింది. అంతేకాదు.. ఈ ఫోటోను పరిశీలనగా చూస్తుంటే ... ఇందులో పాపులర్ కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ కి హన్సిక ప్రచారం చేస్తోంది. అలా ఇన్నర్ ను ఆరాంగా ప్రదర్శిస్తూ హన్సిక ట్రిక్స్ ప్లే చేయడంపై నెటిజనులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక హన్సిక వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు ఎంతో ఆనందంగా కనిపిస్తోంది. ఓవైపు సెట్ లో బిజీ లైఫ్ ని ఆస్వాధిస్తున్న ఈ బ్యూటీ చిన్నపాటి వెకేషన్లను ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడుతోంది. తన చిరకాల మిత్రుడు సోహెల్ కతురియాను పెళ్లాడాక వెకేషన్లకు కొదవేమీ లేదు. డిసెంబర్ 4 న జైపూర్ లో హన్సిక - కతూరియా జంట వివాహం జరిగింది. వివాహానంతరం రెండు రోజుల తర్వాత తిరిగి హన్సిక తన విధుల్లోకి జాయినైంది. సుదీర్ఘ సెలవులు కుదరకపోయినా రీఛార్జ్ అయ్యేందుకు భర్తతో కలిసి షార్ట్ వెకేషన్లను ప్లాన్ చేస్తోంది.
టైట్ షెడ్యూల్ ల నడుమ చిన్నపాటి విరామం తీసుకోవడాన్ని హన్సిక ఆస్వాధిస్తానని తెలిపింది. ఇటీవల థాయ్లాండ్ లో ఒక రోజు షూటింగ్ ముగించుకుని తన టీమ్ తో హన్సిక క్రాబీకి హాలిడే లో జాలీగా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. నిన్నటితో వెకేషన్ ముగిసింది. ''ఇది మూడు రోజుల పాటు చిన్న వెకేషన్ ట్రిప్. తిరిగి వెంటనే పనిలో జాయినవుతాను. ఇది ముందస్తు ప్లాన్ లేని యాత్ర. థాయ్ లాండ్ లో షూటింగుకి నాతో పాటు వచ్చిన మా బృందంతో కలిసి విహారయాత్రకు వెళ్లాను'' అని తెలిపింది.
వ్యక్తిగత వృత్తిగత జీవితాల మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ...ప్రతిదీ ప్రణాళిక ప్రకారం చేయడం తనకు ఇష్టమని తెలిపింది. నాకు సుదీర్ఘ విరామాలు ఇష్టం లేదు. నేను నా పనిని ఆస్వధిస్తాను. వృత్తి నన్ను సంతోషంగా సజీవంగా ఉంచుతుంది. కాబట్టి నేను సంవత్సరానికి రెండు పెద్ద సెలవులతో పాటు (10-12 రోజుల పాటు) ప్రాజెక్ట్ ల మధ్య చిన్న విరామం తీసుకుంటాను. నేను ప్రయాణం చేసి విశ్రాంతి తీసుకోవాలి. వర్క్ లైఫ్ ని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. నేను దానిని బాగా ప్లాన్ చేయగలనని అనుకుంటున్నాను'' అని తెలిపారు.
హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. దేస్ మే నిక్లా హోగా చంద్-షక లక బూమ్ బూమ్-క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ-సన్ పరి వంటి టీవీ షోలలో నటించింది. హృతిక్ రోషన్ సినిమా 'కోయి...మిల్ గయా'లో నటించిన హన్సిక కథానాయికగా ఆప్ కా సురూర్ (2009)-మనీ హై తో హనీ హై చిత్రాల్లో నటించింది. తెలుగు-తమిళంలో పాపులర్ కథానాయికగా కెరీర్ ని సాగిస్తోంది. ప్రస్తుతం రౌడీ బేబీ-గార్డియన్ -మ్యాన్ వంటి చిత్రాలలో నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.