దివి లిప్ కిస్సుల కోసమేనా?

Wed Jan 25 2023 10:02:23 GMT+0530 (India Standard Time)

Is Divi Vadthya Acted For LipLock Scenes

బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలామంది కొత్త వారు పరిచయమయ్యారు. అలాంటి వారిలో దివి కూడా ఒకరు. ఆమె నిజానికి సినిమాలు ముందు నుంచి చేస్తూనే ఉన్నా బిగ్ బాస్ ద్వారానే ఆమెకు మంచి గుర్తింపు లభించింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఆమె అందం బిహేవియర్ చూసి అందరూ ముచ్చట పడిపోయారు. ఆమె భవిష్యత్తులో ఒక స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు కానీ అది అంత ఈజీగా అయితే కనిపించడం లేదు.దివి అటు హౌస్ లో తర్వాత బయటకు వచ్చాక కూడా తనకంటూ సపరేట్గా అభిమానులను సంపాదించుకునే విధంగా నడుచుకుంటూ ఉండేది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాలో చేసిన పాత్ర తర్వాత ఆమెకు తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు లభిస్తాయి అని అందరూ భావించారు.

అదే క్రమంలో ఇటీవల ఆమె ఏటీఎం వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరీష్ శంకర్ రచించిన ఈ వెబ్ సిరీస్ ను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన కుమార్తె హన్షిత రెడ్డి నిర్మించారు.

ఈ వెబ్ సిరీస్ లో దివి నటిస్తుందంటే ఏదో ఒక భారీ పాత్రలో నటించింది ఏమో అనుకున్నారు. కానీ ఇందులో ఆమె పాత్ర ఏమాత్రం ఆసక్తికరంగా లేదనేది ఎవరు కాదలేని వాస్తవం. ఎందుకంటే బిగ్ బాస్ సన్నీ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ లో మరో ముగ్గురు కుర్రాళ్ళు కూడా నటించారు.

అందులో ఒక వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ గా దివి కనిపించింది. మరో దారుణమైన విషయం ఏమిటంటే ఆమె కనిపించేది చాలా తక్కువ సీన్లలోనే ఆ కనిపించిన సీనులో కూడా మూతి ముద్దుల ద్వారా రెచ్చిపోయింది.

ఆ తర్వాత మరిన్ని సీన్స్ లో కనిపిస్తుంది కానీ ఈ సిరీస్ గుర్తు చేసుకోగానే దివి లిప్ కిస్సులు గుర్తు రావడం ఆమె కెరీర్ కి మైనస్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ప్రస్తుతానికి ఆమె భోలా శంకర్ సినిమాలో కూడా కీలకపాత్రలో నటిస్తోంది. ఆ పాత్ర ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.