Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ లో ఆదిపురుష్ డిమాండ్ తగ్గిందా?

By:  Tupaki Desk   |   6 Feb 2023 10:00 PM GMT
ఓవర్సీస్ లో ఆదిపురుష్ డిమాండ్ తగ్గిందా?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో మైథలాజికల్ కథాంశంతో తెరకెక్కింది. ఇక రామాయణం కథని అడాప్ట్ చేసుకొని దానిని కాస్తా మోడ్రనైజ్ చేసి దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. అయితే రామాయణం కథ ఆధారంగా అనేసరికి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ నేపధ్యంలో చాలా గ్రాండ్ గా ఆదిపురుష్ టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే టీజర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా సినిమా పై నెగిటివ్ ప్రచారం స్టార్ట్ అయ్యింది.

సినిమాని ఆధునీకరించడం ఎవరికి నచ్చలేదు. రామాయణాన్ని భారతీయులు అందరూ ఎలా చూస్తున్నారో అలాగే ఉండాలని, టెక్నాలజీ ఉపయోగించుకొని ఇష్టారీతిలో మార్చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

దీంతో ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పై మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. టి సిరీస్ భూషణ్ కుమార్ ఎ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇదిలా ఉంటే ఆదిపురుష్ కి బజ్ ఉన్నా కూడా ఆ సినిమాపై వచ్చిన నెగిటివ్ ప్రచారానికి తోడు ప్రభాస్ చేసిన చివరి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్క్షకులని మెప్పించలేదు.

దీంతో సినిమాకి బయ్యర్ల నుంచి వస్తున్న థీయాట్రికల్ ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. ఓవర్సీస్ లో ఈ మూవీని 35 కోట్లకి మాత్రమే అడుగుతున్నారు.బాలీవుడ్ నుంచి వస్తున్న సినిమా అయినా కూడా అంతకు మించి ఇచ్చేందుకు ఎవరూ మొగ్గు చూపడం లేదని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో తాము అనుకున్న బడ్జెట్ కోట్ చేసి ఎవరైనా రిలీజ్ చేయడానికి ముందుకి రాకుంటే నేరుగా తామే సరిగమమ ద్వారా ఓవర్సీస్ లో రిలీజ్ చేయాలని నిర్మాత భూషణ్ కుమార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

కనీసం ఈ సినిమా ఓవర్సీస్ ద్వారా 100 కోట్ల వరకు ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. నిర్మాత భూషణ్ కుమార్ సినిమాపై భారీ నమ్మకంతో ఉన్నారని, కచ్చితంగా ప్రభాస్ కెరియర్ లో గొప్ప చిత్రంగా ఆదిపురుష్ నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో అనుకున్న ధర రాకపోతే నేరుగా ఓన్ రిలీజ్ కి మొగ్గు చూపించే ఛాన్స్ కనిపిస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.