Begin typing your search above and press return to search.

వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా?

By:  Tupaki Desk   |   1 Jun 2023 3:16 PM GMT
వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా?
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య అయితే ఏకంగా వారిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయిందంటూ పుకార్లు వచ్చాయి. అయితే, ఈ సారి నిజంగానే వీరి నిశ్చితార్థం జరగనుందట. ఈ పెళ్లి కోసమే లావణ్య తనకు వస్తున్న ఆఫర్లను కూడా రిజెక్ట్ చేస్తూ వస్తోందట.

ఈ క్రమంలో వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ చేసినట్లు తెలుస్తోంది. సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల అంటే జూన్ 9వ తేదీన వీరి నిశ్చితార్థం జరగనుందట. ఈ నిశ్చితార్థంలో మెగా హీరోలు అందరూ ఉండాలని అనుకుంటున్నారట.

అందుకే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ డేట్స్ కి ఇబ్బంది కలగకుండా, వారందరికీ కన్వినెంట్ గా ఉండేలా ఈ రోజును సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆరోజే పెళ్లి తేదీని ప్రకటించే అవకాం ఉంది.

కాగా, గతేడాది లావణ్య పుట్టిన రోజు సందర్భంగా బెంగళూరులో స్నేహితులతో పార్టీ చేసుకోగా, ఆ పార్టీలో వరుణ్ కూడా పాల్గొన్నాడట. ఆ సమయంలో వరుణ్ ఆమెకు డైమండ్ రింగ్ ఇచ్చి మరీ మ్యారేజ్ ప్రపోజల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికి వీరి పెళ్లి గ్రీన్ సిగ్నల్ రావడం గమనార్హం.

అయితే, వీరిద్దరికి మిస్టర్ మూవీ సమయంలో పరిచయం ఏర్పడింది. 2017లొ తెరకెక్కిన ఈ సినిమాకి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఆ మూవీ హిట్ కాకపోయినా, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం విశేషం. ఆ తర్వాత అంతరిక్షంలోనూ వీరిద్దరూ జంటగా కనిపించారు. ఇక లావణ్య ఉత్తరప్రదేశ్ కి చెందిన యువతి కాగా, అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున'. మరొకటి... ఏవియేషన్ థ్రిల్లర్. దానిని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం బుడాపెస్ట్ సిటీలో ప్రవీణ్ సత్తారు యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ చేస్తున్నారు.