Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో 'విక్ర‌మ్' త‌ర‌హా ప్ర‌యోగం?

By:  Tupaki Desk   |   25 March 2023 1:00 PM
బాలీవుడ్ లో విక్ర‌మ్ త‌ర‌హా ప్ర‌యోగం?
X
బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ 'విక్ర‌మ్' త‌ర‌హా ప్ర‌యోగానికి రంగం సిద్ధ‌మైందా? అంటే అవున‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ద‌క్షిణాది సినిమాల రీమేకుల్లో న‌టించేందుకు హిందీ స్టార్లు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. ఇక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సినిమాల‌ను హిందీలో రీమేక్ చేయ‌డానికి అత్యుత్సాహం క‌న‌బ‌రుస్తున్నారు. ఇటీవ‌ల 'విక్ర‌మ్' మూవీ సౌత్ - నార్త్ లో సెన్సేష‌న‌ల్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్- విజ‌య్ సేతుప‌తి-ఫ‌హ‌ద్ ఫాజిల్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డి న‌టించారు. స్క్రీన్ ర‌న్ టైమ్ ఆద్యంతం క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని థ్రిల్లింగ్ ట్రీట్ ని ఇచ్చారు. ఓవైపు భీక‌ర‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో గ‌గుర్పొడిచే ఎలిమెంట్స్ తో విక్ర‌మ్ మూవీ ఆద్యంతం సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ గా అద్భుత ట్రీటిచ్చింది.

ఇప్పుడు ఇంచుమించు అదే పంథాలో థ్రిల్లింగ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్ తో బాలీవుడ్ లో ఒక భారీ ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టార‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఖిలాడీ అక్ష‌య్ న‌టించిన‌ ఓ పాపుల‌ర్ క్లాసిక్ హిట్ చిత్రం రీమేక్ ని ప్లాన్ చేయ‌గా ఈ సినిమాలో యాక్ష‌న్ కంటెంట్ అసాధార‌ణంగా ఉంటుంద‌ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ క‌ట్టిపడేస్తాయ‌ని చెబుతున్నారు. దీనిని 'విక్ర‌మ్' కంటే భిన్నంగా మ‌లిచేందుకు కామెడీ ని అద‌నంగా జోడించార‌ని కూడా తెలుస్తోంది. హిందీలో అక్ష‌య్ - టైగ‌ర్ ష్రాఫ్‌- పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఈ మూవీలో క‌లిసి న‌టిస్తున్నారు.

నిజానికి ఇటీవ‌ల ఖిలాడీ అక్ష‌య్ కుమార్ కి బ్యాడ్ టైమ్ ర‌న్ అవుతోంది. వ‌రుస‌గా భారీ బ‌డ్జెట్ సినిమాల‌న్నీ ఫ్లాపులుగా మారాయి. దీంతో అత‌డు మునుముందు తెలివైన గేమ్ ప్లాన్ తో ముందుకు సాగుతున్నాడు. సౌత్ లో ట్రెండ్ ని సునిశితంగా ప‌రిశీలించి పాన్ ఇండియా హిట్లు కొట్టే దిశ‌గా అత‌డు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అనూహ్యంగా గేమ్ ని మార్చుకున్న ఖిలాడీ కుమార్ కి క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన 'విక్ర‌మ్' ఎంతగానో న‌చ్చింది. అందుకే ఇప్పుడు తాను న‌టించిన ఓ క్లాసిక్ హిట్ చిత్రానికి సీక్వెల్ క‌థ‌ను థ్రిల్ల‌ర్ యాక్ష‌న్ ఎలిమెంట్స్ తో విక్ర‌మ్ కి ధీటుగా తీర్చిదిద్దాల‌ని ద‌ర్శ‌కుడిని కోరిన‌ట్టు స‌మాచారం.ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇప్ప‌టికే సెట్స్ పై ఉంది. అంతేకాదు.. ఓ స్టంట్ దృశ్యంలో న‌టిస్తుండ‌గా అక్ష‌య్ కి తీవ్ర‌మైన గాయం అయ్యింద‌ని కూడా తెలుస్తోంది. ప్ర‌స్తుతం అత‌డు రెస్ట్ లో ఉన్నాడు. వైద్యులు చికిత్స చేస్తున్నారని తెలిసింది. స్కాట్లాండ్ లో ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ సాగుతోంది.

మారుతున్న ట్రెండ్ ని ప‌రిశీలిస్తే ఉత్త‌రాది హీరోల‌పై ద‌క్షిణాది ప్ర‌భావం అసాధార‌ణంగా ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. సైలెంట్ గా పాన్ ఇండియా హిట్లు కొడుతూ తెలుగు- క‌న్న‌డ రంగాలు భార‌తీయ సినిమా స్కోరింగ్ చార్ట్ లో టాప్ స్లాట్ లో చేరాయి.

అత్యుత్త‌మ స‌క్సెస్ రేటుతో ముందుకు దూసుకెళుతున్నాయి. అదే స‌మ‌యంలో బాలీవుడ్ గ్రాఫ్ అమాంతం ప‌డిపోవ‌డంతో అక్క‌డ స్టార్ హీరోలు అగ్ర నిర్మాణ సంస్థ‌లు స‌రికొత్త పాన్ ఇండియా వ్యూహాల‌తో స్క్రిప్టుల విష‌యంలో జాగ్ర‌త్త ప‌డ‌డం క‌నిపిస్తోంది. ఖాన్ ల త్ర‌యంతో పాటు ఇప్పుడు ఖిలాడీ అక్ష‌య్ కుమార్ కూడా తెలివైన నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్నాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.