బన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఆ హీరో కూడానా?

Mon Oct 03 2022 12:05:36 GMT+0530 (India Standard Time)

Is Bollywood Hero to Act in Pushpa Movie

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'పుష్ప ది రైజ్'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ముత్యశెట్టి మీడియా సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. గత ఏడాది డిసెంబర్ లో ఐదు భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా వసూళ్లని రాబట్టింది. అల్లు అర్జున్ రష్మిక మందన్న దర్శకుడు సుకుమార్ లని పాన్ ఇండియా స్టార్స్ ని చేసింది.అంతకు మించి 'పుష్ప ది రైజ్' ఉత్తరాదిలో భారీ వసూళ్లని రాబట్టి అక్కడ బన్నీ మార్కెట్ స్టామినాని తెలియజేసింది. దీంతో పార్ట్ 2 గా రానున్న 'పుష్ప ది రూల్' విషయంలో పక్కా ప్రణాళికతో మేకర్స్ దర్శకుడు సుకుమార్ హీరో అల్లు అర్జున్ వెళుతున్నారు. పార్ట్ 1 సొంతం చేసుకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2 బడ్జెట్ తో పాటు అన్ని విషయాల్లో నూ ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారు. ప్రత్యేక గీతం విలన్ వంటి విషయాల్లో ప్లాన్ మొత్తం మార్చేశారు.

త్వరలోనే 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దాదాపు రూ. 350 కోట్లకు మించి ఈ మూవీకి బగ్జెట్ ని కేటాయించారు. అంతే కాకుండా ఆర్టిస్ట్ లు లొకేషన్ ల విషయంలోనూ ప్రత్యేక ప్లాన్ ని దర్శకుడు సుకుమార్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. పార్ట్ 2 లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ అనసూయ సునీల్ విలన్ లుగా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం బాలీవుడ్  హీరోని కూడా రంగంలోకి దింపేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది. మలైకా అరోరాతో గత కొంత కాలంగా డేటింగ్ లో వుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న అర్జున్ కపూర్ ని ఓ కీలక పాత్ర కోసం చిత్ర బృందం అతన్ని సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో భన్వర్ సింగ్ శెకావత్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే.

అదే తరహాలో మరో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర వుందట. దాని కోసమే అర్జున్ కపూర్ ని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. తను ఓకే అంటే బాలీవుడ్ మార్కెట్ మరింతగా పుంజుకోవడం ఖాయమని ఆ ప్లాన్ లో భాగంగానే టీమ్ అర్జున్ కపూర్ ని లైన్ లో పెట్టాలని ప్లాన్ చేస్తోందని అంటున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని అక్టోబర్ 10 నుంచి ప్రారంభించబోతున్నారు. ఫస్ట్ పార్ట్ లా కాకుండా ఈ మూవీకి సంబంధించిన కీలక ఘట్టాల చిత్రీకరణ కోసం టీమ్ విదేశాలు కూడా వెళ్లబోతోందని పలు దేశాల్లో షూటింగ్ జరుపుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బ్యాంగ్ కాక్ థాయిలాండ్ శ్రీలంక వియత్నాం జపాన్ వంటి పలు దేశాల్లో షూటింగ్ కోసం కీలక ప్రాంతాలని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.