తమన్ వద్దు అనిరుధే ముద్దంటున్నారా?

Wed Dec 07 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Is Anirudh Music For SSMB28 Film

అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కలయికలో రూపొందిన 'అల వైకుంఠపురములో' ఏ రేంజ్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమన్ అందించిన ఆడియో ఈ మూవీ హ్యూజ్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ తరువాత ఏ స్టార్ హీరోని కదిలించినా తమన్.. తమన్ అంటూ తమన్ నామ జపం చేస్తూ వచ్చారు. దీంతో 2021లో 'క్రాక్' నుంచి 'అఖండ' వరకు ఏకంగా తొమ్మిది సినిమాలకు సంగీతం అందించి ఆశ్చర్యపరిచాడు.ఇక 2022లో 'సూపర్ మచ్చి' నుంచి 'ప్రిన్స్' వరకు మరో తొమ్మిది సినిమాలు చేశాడు. ఇందులో అత్యధిక శాతం స్టార్ హీరోల సినిమాలే ఎక్కువగా వుండటం గమనార్హం. ఇక 2023లో విడుదలకు రెడీ అవుతున్న క్రేజీ సినిమాలు  కూడా తమన్ చేతిలోనే వున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 'వారీసు' రామ్ చరణ్ - శంకర్ ల RC15 ప్రాజెక్ట్.. నందమూరి బాలకృష్ణ 'వీర సింహారెడ్డి'తో పాటు సూపర్ స్టార్ మహేష్ - త్రివిక్రమ్ ల కలయికలో పుష్కర కాలం తరువాత రూపొందుతున్న SSMB28 కూడా తమన్ చేతిలోనే వుంది.

రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తరువాత కథ అంతా మారిపోయిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ మరో ఫ్రెష్ స్టోరీతో ఈ మూవీని మళ్లీ మొదలు పెట్టబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ మదర్ చనిపోవడం.. ఆ తరువాత మహేష్ ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడంతో SSMB28 రెగ్యులర్ షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే వరుస ఎదురు దెబ్బల నుంచి కోలుకున్న మహేష్ ప్రస్తుతం దుబాయ్ లో మౌంటెన్ డ్యూ కమర్షియల్ లో నటిస్తున్నాడు.

షూటింగ్ పూర్తయి పోవడంతో దర్శకుడు త్రివిక్రమ్ తమన్ సూర్యదేవర నాగవంశీ ..హీరో మహేష్ కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడే తమన్ మ్యూజిక్ సిట్టింగ్ మొదలు పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ సారి తమన్ ని పక్కన పెట్టండి.. ఆ స్థానంలో అనిరుథ్ ని లైన్ లోకి తీసుకోండి అని కోరుతున్నారట. తమన్ ఇటీవల సంగీతం అందించిన సినిమాలకు సోసో మ్యూజిక్ చేశాడు. ఆ పాటలు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

దీంతో తమన్ వద్దు అనిరుధ్ ముద్దు అంటూ మహేష్ ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేయడం మొదలు పెట్టారు. త్రివిక్రమ్ మాత్రం తమన్ కావాల్సిందే అని పట్టుబడుతున్నారట. మహేష్ కూడా తమన్ విషయంలో సంతృప్తిగా లేడని తను కూడా 'విక్రమ్' బీజీఎమ్స్ విన్న తరువాత నుంచి అనురుధ్ తో వెళదామని త్రివిక్రమ్ పై ఒత్తిడి తెస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి బాబు డిమాండ్ మేరకు త్రివిక్రమ్ ..అనిరుధ్ తో వెళతాడా? తమన్ నే కంటిన్యూ చేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.