ఫ్లాష్ బ్యాక్ ఫోటో: కజిన్స్ తో బుల్లి బన్నీ!

Tue Nov 19 2019 18:51:00 GMT+0530 (IST)

Is Allu Arjun Army Is A Part Of Mega Family

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన విషయాలే కాదు.. పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు.  తాజాగా అల్లు అర్జున్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఫోటో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.  తన ఇన్స్టా ఖాతా ద్వారా ఫోటో పోస్ట్ చేసి "తాతయ్య పద్మశ్రీ పురస్కారం అందుకున్న తర్వాత ఆయనను రిసీవ్ చేసుకునేందుకు విమానాశ్రయానికి వెళ్ళాం.  పాలకొల్లు నుంచి పద్మశ్రీ వరకూ.. ఎంత అద్భుతమైన ప్రయాణం ! #అల్లు రామలింగయ్య #పద్మశ్రీ #జ్ఞాపకాలు" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో అల్లు అర్జున్ తో పాటు రామ్ చరణ్.. ఇతర కజిన్స్ కూడా ఉన్నారు.  ఈ ఫోటోలో రామలింగయ్యగారు ఎంతో సంతోషంగా నవ్వుతూ పిల్లలతో సరదాగా పోజివ్వడం నిజంగా ఒక అద్భుతమైన జ్ఞాపకమే.

హాస్యనటుడిగా తెలుగుతెరపై చెరగని ముద్రవేసిన అల్లు రామలింగయ్య గారు ఒక హోమియోపతి డాక్టర్. ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్  అనే సంగతి ఎక్కువమందికి తెలియదు.  ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో పాటుగా రఘుపతి వెంకయ్య అవార్డు కూడా లభించింది.


TAGS: