అల్లు అర్జున్ 1000 కోట్ల ప్లాన్.. దెబ్బేసినట్లేనా?

Tue Mar 21 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Is Allu Arjun 1000 Crores Plan Flop

అల్లు అర్జున్ కెరీయర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం పుష్ప 2. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద దర్శక నిర్మాతలతో పాటు హీరో కూడా దృష్టి సారించాడు. అల్లు అర్జున్ అప్పటివరకు స్టైలిష్ స్టార్ గా పిలిపించుకునే వాడు... కానీ పుష్ప సినిమా దెబ్బకు ఆయన ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.ఇక తన రేంజ్ కూడా వేరే లెవల్ కి వెళ్ళిపోయిందని మార్కెట్లో ప్రూవ్ చేసుకునేందుకు గాను ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సంస్థలతో అగ్రిమెంట్లు చేసుకుని బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ అనేక డబ్బులు వెనకేసుకుంటున్న అల్లు అర్జున్... పుష్ప 2 సినిమా బిజినెస్ దాదాపు 1000 కోట్ల వరకు చేసేలా నిర్మాతలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. 1000 కోట్ల మార్కెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలా జరిగిందని మార్కెట్లోకి వస్తే... అల్లు అర్జున్ క్రేజ్ రెండింతలు అవ్వడం ఖాయం.

ఇదే ప్లాన్ తో అల్లు అర్జున్ ప్రయత్నాలు చేశారు. కానీ అది పూర్తిస్థాయిలో సఫలం అవ్వలేదని అంటున్నారు. అల్లు అర్జున్ మాట మేరకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తే దాదాపు 6 నుంచి 700 కోట్ల వరకు ఈ సినిమాకి మార్కెట్ అయినట్లుగా తెలుస్తోంది.

వాస్తవానికి పుష్ప మొదటి భాగానికి ఈ రేంజ్ లో మార్కెటింగ్ అయితే చేయలేదు. సినిమా మీద నమ్మకం ఉంది కానీ హిందీ బెల్టులో కూడా ఈ రేంజ్ ఆదరణ లభిస్తుందని తెలియక సినిమా మొదలుపెట్టిన కొత్తలోనే హిందీ రేట్లు చాలా తక్కువకే అమ్మేశారు.

హిందీ హక్కులు కొనుక్కున్న వారికి పుష్ప మొదటి భాగం కనక వర్షం కురిపించింది. ఇక ఈ రేంజ్ మార్కెట్ తనకే ఉందని అల్లు అర్జున్ తెలియడంతో ఒక్కసారిగా మార్కెట్ను 1000 కోట్ల వరకు పెంచుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మూడు నిమిషాల టీజర్ కట్ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.