Begin typing your search above and press return to search.
మహేష్ - ఐశ్వర్య రాయ్ కాంబో.. ఇదే నిజమైతే
By: Tupaki Desk | 30 Jan 2023 11:00 AMసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో కూడా ఒక సీనియర్ హీరోయిన్ ను నటింపజేస్తున్న విషయం తెల్సిందే. గత చిత్రం అల వైకుంఠపురం లో టబు కీలక పాత్రలో కనిపించింది.
మహేష్ బాబు సినిమాలో ఎవరు నటిస్తారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రకు గాను ఐశ్వర్య రాయ్ ని సంప్రదించే ప్రయత్నంను త్రివిక్రమ్ టీమ్ చేస్తుందట.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుంది. అందుకే బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతే కాకుండా మహేష్ బాబు వంటి సూపర్ స్టార్.. అంతే కాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అవ్వడం వల్ల ఐశ్వర్య రాయ్ నటించేందుకు ఓకే చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనే ప్రచారం జరుగుతోంది.
నిజంగానే మహేష్ బాబు సినిమాలో ఐశ్వర్య రాయ్ కనిపిస్తే కచ్చితంగా అద్భుతమే అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఈ కాంబో గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ గట్టిగా తల్చుకుంటే అవుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మహేష్ బాబు సినిమాలో ఐశ్వర్య నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి ఈ సినిమా గురించి జరుగుతున్న ఈ ప్రచారం విషయంలో ఎప్పటికి క్లారిటీ వస్తుందా అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.