ఆ అందాల తార.. రెండోసారి గర్భంతో.. పెద్ద వార్తే..?

Sat Sep 24 2022 17:08:08 GMT+0530 (India Standard Time)

Is Aishwarya Rai Bachchan Pregnant

ఆమె మామ బాలీవుడ్ ను దశాబ్దాలు ఏలారు.. ఆమె అత్త మంచి నటిగా చరిత్రలో నిలిచారు.. ఆమె భర్త ప్రతిభ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.. ఇక ఆమె గురించి అయితే.. ఎంత చెప్పినా తక్కువే..? అందానికి అందం.. అభినయానికి అభినయం.. వివాదాలకు తావివ్వని ప్రవర్తన.. అటు కుటుంబం.. ఇటు సినిమాలకు సమ ప్రాధాన్యం.. వెరసి చరిత్రలో నిలిచిపోయే అందగత్త గానే కాదు.. చరిత్రకెక్కే స్థాయి నటిగా నిలిచించామె.. అంతెందుకు.. ఆమె అందాన్ని ప్రపంచమే గుర్తించింది. ఇంతకూ ఆమె ఎవరో మీకు తెలిసిపోయే ఉంటుంది.. ఐశ్వర్యారాయ్.బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కుమారుడు నటుడు అభిషేక్ ను వివాహమాడి ఒక కుమార్తెకు తల్లయిన ఐష్ ఇప్పడు మళ్లీ గర్భంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదేనా సంకేతం..?

పొన్నియన్ సెల్వన్.. దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఐశ్వర్య రాయ్ సహా ఎందరో కీలక తారలు ఇందులో నటించారు. కాగా ఈ సినిమా విడుదలకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐశ్వర్య సైతం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ముంబై విమానాశ్రయం టెర్మినల్ 2 నుంచి శుక్రవారం ఆమె బయటకు వస్తుండగా కెమెరాలు క్లిక్ మనిపించాయి.

నల్లటి పొడవాటి దుస్తులు ధరించిన ఐష్.. పైన తెల్ల బ్యాగీ కోటు కప్పుకొని ఉన్నారు. దీనిని బట్టి ఐష్ మళ్లీ గర్భంతో ఉన్నారంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు. ''త్వరలో శుభవార్త వినొచ్చు'' అంటూ ఒకరు కామెంట్ చేస్తే 'ఆమె గర్భంతో ఉన్నారా? రెండో బిడ్డ రానున్నారు'' అని  మరొకరు పేర్కొన్నారు.

11 ఏళ్ల తర్వాత

ఐస్.. 2007 ఆగస్టులో అభిషేక్ ను వివాహమాడారు. వీరికి 2011 నవంబరులో ఆరాధ్య జన్మించింది. మరో సంతానం గురించి ఆలోచిస్తున్నట్లు ఈ దంపతులు ఎక్కడా చెప్పలేదు. అది వారి పూర్తి వ్యక్తిగత విషయంగానే అభిమానులూ భావించారు.

అయితే మళ్లీ ఇప్పుడు ఐష్ గర్భంతో ఉందనే వార్తలు వస్తుండడంతో అభిమానులు స్పందిస్తున్నారు. ఒకవేళ ఈ కథనాలే నిజమైతే.. 11 ఏళ్ల తర్వాత అభిషేక్ -ఐష్ దంపతులకు మళ్లీ సంతానం కలగనున్నట్లు అవుతుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.