సామాజిక కర్తగా పవర్ ఫుల్ పాత్రలో రేణు దేశాయ్

Thu Sep 29 2022 20:44:37 GMT+0530 (India Standard Time)

Introducing Renu Desai From TigerNageswararao

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తొలి పాన్-ఇండియా చిత్రం `టైగర్ నాగేశ్వరరావు`. వంశీ  దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ మూవీ ప్రారంభం నుండి ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర లో జాతీయ అవార్డు గ్రహీత అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి రేణు దేశాయ్ ప్రీలుక్ వీడియో ఒకటి రిలీజై వైరల్ గా మారింది.అనుపమ్ ఖేర్ సర్ తర్వాత రేణు దేశాయ్ ఈరోజు కొత్త షెడ్యూల్ కోసం సెట్స్ లోకి చేరారు. రచయిత సామాజిక కార్యకర్తగా చాలా కీలకమైన శక్తివంతమైన పాత్రను రేణు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో  హేమలత లవణం అనే పాత్రలో కనిపిస్తారు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత రేణు దేశాయ్ తిరిగి పెద్ద తెరపై కి రీఎంట్రీ ఇస్తుండడంతో పవన్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.  

టైగర్ నాగేశ్వరరావు పేరు మోసిన దొంగ. స్టూవర్డ్ పురం దొంగగా అతడు పాపులరయ్యారు. ఇది టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అని కూడా చెప్పొచ్చు. 1970 నేపథ్యంలో స్టూవర్ట్‌పురం అనే గ్రామంలో కథాంశం రన్ అవుతుంది. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్- గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రవితేజ బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ మూవీ దర్శకుడు వంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రవితేజ ఎనర్జీ .. దాని ప్రభావం అందరికీ తెలుసు.. కానీ టైగర్ నాగేశ్వరరావులో రవితేజని ఏమీ కొత్తగా చూపించడానికి ప్రయత్నించడం లేదు. సినిమా చూసినప్పుడు అది రవితేజ కాదు టైగర్ నాగేశ్వరరావు అని అనిపిస్తుంది. యాక్షన్ గురించి ప్రస్థావిస్తే హై స్కేల్ ఫైట్ సీక్వెన్స్ లు అలరిస్తాయి! అని ఆయన తెలిపారు.

ఇది నిజ జీవిత పాత్ర. హేమలత లవణం ఒక భారతీయ సామాజిక కార్యకర్త .. రచయిత.. అంటరానితనం సామాజిక వ్యవస్థలో అసమతుల్యతకు వ్యతిరేకంగా నిరసించిన మేటి వనిత. రేణు దేశాయ్ ఈ  వీడియోలో తెల్ల చీరలో కనిపించగా.. మరో ఇద్దరు మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడుస్తూ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చింది. జివి ప్రకాష్ కుమార్ బిజిఎమ్ పాత్ర తీరును బెటర్ గా ఆవిష్కరించింది.

తెలుగు- తమిళం- కన్నడ- మలయాళం- హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి ఆర్ మదీ ఐఎస్‌సి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తుండగా... శ్రీకాంత్ విస్సా డైలాగ్ లు అందిస్తున్నారు. మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. 2009లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2012లో విడిపోయారు. అకీరా నందన్- ఆధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అకీరానందన్ త్వరలోనే కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తాడనే టాక్ అభిమానుల్లో ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.