Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూసివ్ - క్వారంటైన్ స్పెష‌ల్ - ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌తో చిట్ చాట్

By:  Tupaki Desk   |   27 April 2020 3:30 AM GMT
ఎక్స్ క్లూసివ్ - క్వారంటైన్ స్పెష‌ల్ - ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌తో చిట్ చాట్
X
* హాయ్ వెంకీ ఎలా ఉన్నారు అనే ప్ర‌శ్న రొటిన్ అయిన‌ప్ప‌టికీ, అడ‌గ‌క త‌ప్ప‌డం లేదు, ప్రె‌జెంట్ పొజిష‌న్ అలా ఉంది, ఏమంటారు

నూటికి నూరు శాతం ఇప్పుడు ఈ రొటిన్ క్వ‌శ్చ‌న్ కి స‌రైన ఆన్స‌ర్ ఇవ్వాలంద‌రూ, లేక‌పోతే చెల్లించుకోవాలి భారీ మూల్యం. బాగా లేక‌పోతే బాలేద‌నే చెప్పాలి, ఉన్న‌ది లేన‌ట్లు - లేనిది ఉన్న‌ట్లు చెప్పే టైమ్ కాదు ఇది. మ‌నఃస్పూర్తిగా చెబుతున్న నేను బాగానే ఉన్నానండి, లాక్ డౌన్ కి ముందే సొంతూరు వ‌చ్చేశాను. ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్, సారీ ఈ క్వారంటైన్ హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తున్న.


* మీ ద‌గ్గ‌ర నుంచి ఇలాంటి ఆర్గానిక్ ఆన్స‌ర్ ఎక్స్ పెక్ట్ చేశాను

న‌వ్వులు....! ఎస్ అవునండి, నిర్మోహ‌టంగా మ‌నలో ఏదైనా స‌మ‌స్య ఉంటే బ‌య‌ట‌కు చెప్పాల్సిన స‌మ‌యం ఇది. బాగా చ‌దువుకున్న వాళ్లే ఈ వ్యాధిని ఎక్కువుగా ప‌క్క వారికి వ్యాప్తి చేస్తున్నార‌ట‌, ఇంత‌కంటే దారుణం ఏదైనా ఉంటుందా...! తెలియ‌నోడు చేస్తే త‌ప్పు, తెలిసినోడు చేస్తే పాపం, నేరం.

* క‌రోనా పై వ‌స్తున్న వార్త‌లు మిమ‌ల్ని బాగా ప్ర‌భావితం చేస్తున్న‌ట్లు అనిపిస్తోంది

మొత్తం ప్ర‌పంచం ఎదుర్కొంటున్న స‌మ‌స్య ఇది, ఈ టైమ్ లో మ‌నం ప్ర‌తి విష‌యాన్ని స్లో మోష‌న్ లోనే చూడాలి. ఒక‌టికి రెండు సార్లు ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి. ఈ క‌థ‌లో విల‌న్ హాలో మేన్(కంటికి క‌నిపించ‌ని శత్రువు)

* అంటే ఇప్పుడు మీ మూడో చిత్ర క‌థ‌ ఇలాంటి పాయింట్ తోనే రెడీ అవుతుందా

బాబోయ్...! ఇంకా అస్స‌లు లైన్ కూడా అనుకోలేదండి, క‌రోనా మీద నా మూడో సినిమా అని న్యూస్ లు వ‌చ్చేస్తాయి అన‌వ‌స‌రంగా (న‌వ్వులు)...! ఓ క్లారిటీ కోసం చెబుతున్న ప్ర‌స్తుతం నేను ఓ క‌థ రాసుకోవ‌డం కోసం ప్లాన్ చేస్తున్నా, ఇంకా దానికి సంబంధించిన పాయింట్ ఏది అనుకోలేదు.

* మూడో సినిమా ఎవ‌రితో ఉండొచ్చు

అస‌లే క‌థే ఇంకా అనుకోలేదండి, ఏదైనా క‌థ పూర్తి అయ్యాకే ఎవ‌రనైనా క‌లిసి నెరేట్ చేసిది, అయితే కొన్ని పెద్ద నిర్మాణ సంస్థ‌లు నాకు అవ‌కాశం ఇవ్వ‌డానికి రెడీగా ఉన్నారు. ఈ లాక్ డౌన్ అయ్యాక ఆ వివ‌రాలు ప్ర‌క‌టిస్తాను

* భీష్మ డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన‌ట్లుంది, ఇండ‌స్ట్రీ నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తోంది

డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే ఓటిటిలో కూడా హిట్ అనేగా మీ అర్ధం, భీష్మ థియేట‌ర్ రిలీజ్ అయిన‌ప్పుడు వ‌చ్చిన విషెస్ కంటే ఎక్క‌వ కాల్స్ వ‌స్తున్నాయి. సాయిధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్ త‌దిత‌ర హీరోలు మెసేజ్ చేసి వారి ఫ్యామిల‌తో సినిమా చూశామ‌ని చెప్ప‌డం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వెంక‌టేశ్ గారు, త‌మిళ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ ఫోన్స్ చేసి మెచ్చుకున్నారు.

* వెంకీ కుడుముల‌ స్టోరీలు రాయ‌లేర‌ని వ‌స్తున్న విమర్శ‌ల‌కు మీరిచ్చే రెస్పాన్స్

నేను క‌థ‌లు రాయ‌గ‌ల‌నా లేదా అనే విషయం, నా డైరెక్ష‌న్ టాలెంట్ ఇలా నా పై వ‌స్తున్న ప్ర‌తి విమ‌ర్శ‌కి నా భీష్మ సినిమానే స‌మాధానం చెప్పింది. అలా అని నేను రెండు సినిమాల‌కే కాలర్ ఎత్త‌డం లేదు, ప్ర‌తి సినిమాకి నా కెరీర్ జీరో నుంచే స్టార్ట్ చేయాలి. ఇన్ ఫ్యాక్ట్ డైరెక్ష‌న్ డిపార్ట్మెంట్ లోనే ఈ లోటు ఉంది. ఇక్క‌డ‌ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్స్ కంటే స‌క్సెస్ పుల్ డైరెక్ట‌ర్స్ ఎక్క‌వ..! అంటే నా ఉద్దేశం ఫుల్ గా స‌క్సెస్ ఉన్న డైరెక్ట‌ర్స్ కంటే స‌క్సెస్ వ‌స్తేనే ముందుకు వేళ్లే డైరెక్ట‌ర్స్ ఎక్క‌వు మంది ఉన్నారు.

* ఫ్లాప్ వ‌స్తే డైరెక్ట‌ర్ కెరీర్ ఆగి పోయిన‌ట్లేనా

ఫ్లాప్ కాదు ఎవ‌రేజ్ వ‌చ్చినా ఆగి పోయినట్లే, ఎందుకంటే ప్ర‌స్తుతం ప‌రిస్థితి అలా ఉంది.

* జ‌బర్ధ‌స్థ్ టు భీష్మ ఈ జ‌ర్నీలో మీలో వ‌చ్చిన మార్పులు ఏంటి

ఏం తేడా లేదండి, సేమ్ టు సేమ్ అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నా, కానీ మ‌నొడెవ‌డో, ప‌క్కొడెవ‌డో తేడా తెలిసింది. మ‌రీ ముఖ్యంగా నా రెండో సినిమా జ‌రుగుతున్న టైమ్ లో చాలా నేర్చుకున్న‌

* ఇలానే మీరు హెల్తీగా, ఆర్గానిక్ హ్యూమ‌ర్ ఉండే సినిమాల్ని రూపొందించాలని మా తుపాకీ టీమ్ మన స్ఫూర్తిగా కోరుకుంటుంది, థాంక్యు - ఆల్ ది బెస్ట్

తుపాకీ డాట్ కామ్ రీడ‌ర్స్ అంద‌రికి నా విన్న‌పం లాక్ డౌన్ అయ్యేంత వ‌ర‌కు ప్లీజ్ ఇంట్లోనే సేఫ్ గా ఉండండి, థాంక్యు