ఇంట్రెస్టింగ్ : విక్రమ్ కు ఖైదీ 2 కి సూర్యతో లింక్

Sun May 29 2022 09:00:02 GMT+0530 (IST)

Interesting: Link with Vikram to Khadi 2 Surya

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మరి కొన్ని రోజుల్లో రాబోతున్న విక్రమ్ సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి మరియు మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ లు కీలక పాత్రల్లో నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా లో ఈ ముగ్గురు స్టార్స్ తో పాటు తమిళ స్టార్ హీరో సూర్య కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.సూర్య గెస్ట్ రోల్ విషయాన్ని యూనిట్ సభ్యులు అనధికారికంగా రివీల్ చేశారు. విక్రమ్ క్లైమాక్స్ లో సూర్య కనిపించబోతున్నాడట. విక్రమ్ కథకు సూర్యకు ఎక్కువ సంబంధం ఉండదని... కాని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ తర్వాత రాబోతున్న ఖైదీ 2 కు సంబంధం ఉంటుందని అంటున్నారు. విక్రమ్ సినిమాలో తన రాబోయే సినిమా ఖైదీ 2 కు సంబంధించిన హింట్ ను వదలబోతున్నాడు.

కార్తీ హీరోగా తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఖైదీ సినిమా సీక్వెల్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలు అయ్యాయి. ఆ సినిమాలో సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ఆ పాత్ర ను ఖైదీ 2 లో కంటే ముందుగానే విక్రమ్ లోనే చూపించే విధంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేశాడని తమిళ మీడియా వర్గాల్లో మరియు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయాడు. ఆయనతో ఏకంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు విజయ్ లు కూడా సినిమాలు చేయాలని ఆశ పడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉన్న లోకేష్ కనగరాజ్ విక్రమ్ కు ఖైదీ 2 కు సూర్య తో లింక్ కలపడం చాలా వైవిధ్యభరితంగా ఉందని... ఇలాంటిది హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూస్తామంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.

ఖైదీ 2 సినిమా ను విక్రమ్ విడుదల అయిన వెంటనే మొదలు పెట్టబోతున్నాడు. కార్తీ మరియు సూర్య కలిసి నటించబోతున్న సినిమా అవ్వడంతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా అవ్వడం వల్ల ఖైదీ 2 మొదలు అవ్వకుండానే భారీ అంచనాలను కలిగి ఉంది.

విక్రమ్ సినిమా విషయానికి వస్తే పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల అవుతోంది. విక్రమ్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయితే ఖచ్చితంగా ఖైదీ 2 ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే అవకాశం ఉంది.