Begin typing your search above and press return to search.

రాధే శ్యామ్ ద‌ర్శ‌కుడికి బిగ్ ఝ‌ల‌క్!

By:  Tupaki Desk   |   11 July 2020 4:45 AM GMT
రాధే శ్యామ్ ద‌ర్శ‌కుడికి బిగ్ ఝ‌ల‌క్!
X
`రాధే శ్యామ్` ఫస్ట్ లుక్ పోస్టర్ దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానుల్లో ఎగ్జ‌యిట్ మెంట్ పెంచిన సంగ‌తి తెలిసిందే. ఇన్నాళ్ల వెయిటింగ్ ఫ‌లించ‌డంతో ప్ర‌చారంలో వేడి పెరిగింది. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. క్లాసిక్ డేస్ రొమాంటిక్ డ్రామాతో మూవీ ఆద్యంతం ఓ డిఫ‌రెంట్ ఫీల్ ని క్రియేట్ చేసేందుకు ద‌ర్శ‌కుడు చాలానే శ్ర‌మిస్తున్నాడు. పైగా రాధే శ్యామ్ రిచ్ పూర్ ల‌వ్ స్టోరి కావ‌డంతో ఫ్యాన్స్ లో మ‌రింత ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు.

అయితే ఫ‌స్ట్ లుక్ సంబ‌రాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయ‌క‌ముందే రాధేశ్యామ్ ద‌ర్శ‌కుడికి ఇన్ స్టాగ్ర‌మ్ వాళ్ల నుంచి ఊహించ‌ని ఝ‌ల‌క్ త‌గిలింది. అభిమానుల‌తో ముచ్చ‌ట్ల‌కు ఆస్కారం లేకుండా ఇబ్బందికర స‌న్నివేశం త‌లెత్తింది. దీంతో ఆ సంగ‌తిని చెప్పేందుకు రాధా కృష్ణ కుమార్ ట్విట్టర్ ని ఆశ్ర‌యించారు. ``నేను వేరొకరిలా నటిస్తున్నానని (డ‌మ్మీ ఖాతా అనుకుని) ఇన్ స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేశారు`` అంటూ ఆవేదన చెందాడు. “ఇంత‌కీ ఆ వ్యక్తి ఎవరు?” అని ఇన్ స్టా ప్ర‌తినిధుల్ని ప్ర‌శ్నించాడు రాధా కృష్ణ‌.

ఇక్క‌డో ఆస‌క్తిక‌ర‌ విషయం ఏమిటంటే.. ఫ‌స్ట్ లుక్ లాంచ్ కి ముందు నుంచే చాలా మంది అభిమానులు రాధా కృష్ణ కుమార్ ని నిరంత‌రం ఇన్ స్టాలో అనుస‌రిస్తూ ముచ్చ‌టిస్తున్నారు. ``ప్రభాస్ 20 పై ఇన్నాళ్లు అప్ డేట్ ఇవ్వ‌నందుకు ఇలా ఇన్ స్టా వాళ్లు బ్లాక్ చేశారు`` అంటూ ప‌లువురు అభిమానులు దీనిపై స‌ర‌దా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.