వీడియో : పుష్ప జోరు కంటిన్యూ.. మరో ఇద్దరు టీం ఇండియా క్రికెటర్స్ డాన్స్

Sun Jan 16 2022 12:33:12 GMT+0530 (IST)

Indian cricketers groove to Srivalli Song!

పుష్ప సినిమా విడుదల అయిన మొదటి రోజు వచ్చిన టాక్ కు.. వసూళ్లు అయిన కలెక్షన్స్ కు పొంతన లేకుండా ఉంది. బాలీవుడ్ లో ఈ సినిమా పాతిక కోట్లు వసూళ్లు చేస్తే గొప్ప విషయం అన్నట్లుగా స్వయంగా మేకర్స్ భావించినట్లుగా పుకార్లు వచ్చాయి. కాని ఏకంగా 80 కోట్లకు పైగా పుష్ప సినిమా అక్కడ రాబట్టింది. ఇంకా కొన్ని చోట్ల థియేటర్ రన్ పుష్ప కుమ్మేస్తుంది. పుష్పకు ఇతర రాష్ట్రాల్లో ఓవర్సీస్ లో కలిపి మొత్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి. నాన్ బాహుబలి రికార్డును ఈజీగా దక్కించుకున్న పుష్ప సినిమా విడుదల అయ్యి వారాలు గడుస్తున్నా కూడా జోరు మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమా హడావుడి అంతు లేకుండా ఉంది.సోషల్ మీడియాలో పుష్ప సినిమా యొక్క డైలాగ్స్.. డాన్స్ స్టెప్పులు.. అల్లు అర్జున్ తగ్గేదే లే మ్యానరిజం ఇంకా చాలా చాలా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇన్ స్టా లో షార్ట్ వీడియోలు రీల్స్ మొదలుకుని అనేక ప్లాట్ ఫామ్ మీద పుష్ప పాటలు వైరల్ అవుతున్నాయి. అన్నింటికి మించి టీం ఇండియా క్రికెటర్స్ ఇప్పటికే పలువురు పుష్ప ను అనుకరించారు. పుష్ప డైలాగ్ ను చెప్పారు.. పుష్ప పాటలకు స్టెప్పులు వేశారు. టీం ఇండియా క్రికెటర్ లు ఇప్పటికే అందరు కూడా పుష్ప హిందీ వర్షన్ ను చూశారు. వారందరికి కూడా పుష్ప సినిమా బాగా నచ్చింది.

కోహ్లీ మొదలుకుని పలువురు పుష్ప సినిమా గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా టీం ఇండియా ఆటగాళ్లు అయిన ఇషాన్ మరియు సూర్య కుమార్ లు పుష్ప లోని శ్రీవల్లి పాటకు బన్నీ తరహా స్టెప్ వేశారు. బన్నీ చెప్పు వదిలేసి విభిన్నంగా వేసే ఆ స్టెప్పును ఇద్దరు కలిసి అలాగే వేసేందుకు ప్రయత్నించారు. వీరి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమాకు సంబంధించిన ఈ వీడియో సినిమా క్రేజ్ ను మరింత పెంచింది అనడం లో సందేహం లేదు. ప్రస్తుతం అమెజాన్  లో స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప సినిమా సందడి ఇంకా ఎన్ని వారాలు కంటిన్యూ అవుతుందో చూడాలి.