Begin typing your search above and press return to search.

ఇండియన్‌ సీనియర్‌ స్టార్స్‌ అంతా అదే బాపతు

By:  Tupaki Desk   |   5 Dec 2019 7:47 AM GMT
ఇండియన్‌ సీనియర్‌ స్టార్స్‌ అంతా అదే బాపతు
X
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ లైఫ్‌ స్పాన్‌ తో పోల్చితే హీరోలది చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరు స్టార్‌ హీరోలు ఆరు ఏడు పదుల వయసు వచ్చినా కూడా ఇంకా రొమాంటిక్‌ సీన్స్‌ చేయడం.. అల్లరి అల్లరిగా నటించడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇండియన్‌ సినీ స్టార్స్‌ ముసలి వాళ్లు అయినా కూడా పాతిక ఏళ్ల లోపు హీరోయిన్స్‌ తో రొమాంటిక్‌ సీన్స్‌ లో నటిస్తున్నారు. కొన్ని సార్లు ఎబ్బెట్టుగా ఉన్నా ప్రేక్షకులు వాటినే ఆధరిస్తున్నారు.. వారి సినిమాలను సక్సెస్‌ చేస్తున్నారు. దాంతో ఎప్పటి నుండో అదే కొనసాగుతూ వస్తోంది.

ఇటీవల బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండియాలో ఉన్న ప్రతి సీనియర్‌ హీరోలకు తాకేలా ఉందంటూ నెటిజన్స్‌ అంటున్నారు. ఇంతకు ఆమె ఏమందంటే నేను అయిదు పదుల వయసు దాటిన తర్వాత ఖచ్చితంగా పాతికేళ్ల కుర్రాడితో రొమాంటిక్‌ సీన్స్‌ చేయను.. నా కంటే చాలా చిన్న వయసు హీరోలకు జోడీగా హీరోయిన్‌ గా నటించను అంటూ మాట్లాడింది.

ఆమె మాటలు ఇండైరెక్ట్‌ గా చాలా మంది సీనియర్‌ హీరోలకు తలిగేలా ఉన్నాయి. తెలుగు.. తమిళం.. హిందీ ఇలా అన్ని భాషల సీనియర్‌ స్టార్‌ హీరోలు 20 నుండి 25 ఏళ్ల లోపు హీరోయిన్స్‌ తో నటించడం మనం కామన్‌ గా చూస్తూనే ఉన్నాం. గతంలో సోనాక్షి సిన్హా కూడా తనకంటే చాలా చాలా పెద్ద వయస్కుడు అయిన రజినీకాంత్‌ తో నటించింది. ఆ సమయంలోనే విమర్శలు వచ్చినా ఆమె పట్టించుకోకుండా నటించింది. సోనాక్షి సిన్హా వ్యాఖ్యలపై కొందరు నటించే హీరోయిన్స్‌ కు లేని ఇబ్బంది.. చూసే ప్రేక్షకులకు లేని ఇబ్బంది నీకేంటో అంటూ మండి పడుతున్నారు.