సూపర్ స్టార్ ఇంట్లో ఇండియన్ క్రికెటర్స్

Sat Mar 18 2023 21:15:47 GMT+0530 (India Standard Time)

Indian Cricketers at SuperStar Rajinikanth Home

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో జైలర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్య రజినీకాంత్ సినిమాలతో పాటు బయట యాక్టివిటీస్ పై కూడా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఆ మధ్యకాలంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెంకయ్యనాయుడు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి ఎంత వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ మధ్య స్పోర్ట్స్ పైన కూడా రజినీకాంత్ ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా ముంబైలో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ ని స్టేడియం వెళ్లి వీక్షించారు.

ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకం ఆహ్వానం మేరకు మ్యాచ్ ని వీక్షించడానికి రజినీకాంత్ వెళ్ళారు. ఇక క్రికెట్ మ్యాచ్ ని ఎంసీఏ ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ తో కలిసి గ్యాలరీలో కూర్చొని వీక్షించారు.

అనంతరం టీమ్ ఇండియా క్రికెటర్స్ ని రజినీకాంత్ ఇంటికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో బౌలర్ కులీప్ యాదవ్ వాషింగ్టన్ సుందర్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటికి వెళ్ళారు. ఆయనతో కలిసి కొద్ది సేపు మాట్లాడారు.

ఇక రజినీకాంత్ ని కలిసినట్లు కుల్దీప్ యాదవ్ ట్విట్టర్ లో ఫోటోలు షేర్ చేసి పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక రజినీకాంత్ మ్యాచ్ వీక్షించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే  మొదటి మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 189 పరుగులకి ఆలౌట్ కాగా కెఎల్ రాహుల్ రవీంద్ర జడేజా రాణించడంతో టీమ్ ఇండియా ఈ మ్యాచ్ గెలిచింది.

మొదటి మ్యాచ్ లో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీసుకోగా మహ్మద్ షమీ మూడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా తక్కువ స్కోర్ కి ఆలౌట్ అయ్యింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.