Begin typing your search above and press return to search.

#DEATH BELLS కేరాఫ్ ఫిల్మ్ స్టూడియో!!

By:  Tupaki Desk   |   22 Feb 2020 6:45 AM GMT
#DEATH BELLS కేరాఫ్ ఫిల్మ్ స్టూడియో!!
X
భార‌తీయుడు 2 ఆన్ లొకేష‌న్ ట్రాజెడీ హృద‌యాల్ని క‌ల‌చివేసిన సంగ‌తి తెలిసిందే. చెన్న‌య్ ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జ‌రుగుతుండ‌గా క్రేన్ తెగి మీద ప‌డ‌టంతో ముగ్గురు మృత్యువాత ప‌డ‌గా ప‌ది మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న కోలీవుడ్ స‌హా టాలీవుడ్ ని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది. అయితే ఈవీపీ ఫిల్మ్ సిటీలో ఇదే తొలి ప్ర‌మాద‌మా? ఇవే తొలిసారి మ‌ర‌ణాలా? అంటే కానే కాద‌ట‌. గ‌తంలోనూ ఎన్నో యాక్సిడెంట్లు జ‌రిగిన‌ డెత్ స్పాట్ గా పేరుంద‌న్న‌ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మొత్తం వేరు వేరు ఘ‌ట‌న‌ల్లో 7 గురికి పైగా మృత్యువాత ప‌డిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వాస్త‌వానికి పూంద‌మ‌ల్లి స‌మీపం లో కొన్ని ఎక‌రాల్లో ఉన్న ఈ భారీ ఫిల్మ్ సిటీకి స‌రైన అనుమ‌తులు కూడా లేవట‌.

2012లో ఈవీపీ థీమ్ పార్క్ గా పాపుల‌ర్ స్పాట్ అది. ఆరంభమే మొద‌టి రోజున‌ అక్క‌డ ఓ బాలిక రంగుల రాట్నం తిరుగుతూ అదుపు త‌ప్పి కింద ప‌డిపోయిందిట‌. తీవ్ర‌గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకుంది. అదే ఏడాది సెప్టెంబ‌ర్ లో స్విమ్మింగ్ పూల్ లో ఓ చిన్నారి జారి ప‌డిపోయింది. అదృష్టవ‌శాత్తు ప్రాణాల‌తో బ‌య‌టప‌డింది. మ‌ళ్లీ అదే నెల‌లో ఆక్టోప‌స్ రాట్నం లో ఓ మ‌హిళ జారి ప‌డి ప్రాణాలు కోల్పోయిందిట‌. ఇలా వ‌రుస ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఆ పార్క్ లో కి వెళ్లాలంటేనే భ‌య‌ప‌డి ప్ర‌జ‌లు రావ‌డం త‌గ్గించేసారు. కాల‌క్ర‌మేనా అది మూత‌ప‌డింది. దీంతో ఆ మార్గం లో వెళ్ల‌డానికి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డే వార‌ని మీడియా క‌థ‌నాలు వేడెక్కించాయి.

కొంత‌కాలం త‌ర్వాత‌ ఈవీపీ థీమ్ పార్క్ కాస్తా.. ఈవీపీ ఫిల్మ్ సిటీగా రూపాంత‌రం చెందింది. పార్క్ ని స్టూడియోగా మార్పు చేసి రీ ఓపెన్ చేసారుట‌. 2017 లో `కాలా` షూటింగ్ స‌మ‌యంలో మైఖేల్ అనే కార్మికుడు విద్యుద్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. 5 కోట్ల‌తో వేసిన ఆ సెట్ కొంత భాగం కాలిపోయి నిర్మాత‌కు న‌ష్టం వాటిల్లిందిట‌. త‌ర్వాత ఇదే పిల్మ్ సిటీలో బిగ్ బాస్ రెండ‌వ సీజ‌న్ సెట్ ఇక్క‌డే వేసారు. ఇందులో ఏసీ రిపేర్ చేస్తుండ‌గా మెకానిక్ గుణ‌శేఖ‌ర్ జారి కింద ప‌డి తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఇక బిగిల్ సినిమా కోసం పుట్ బాల్ సెట్ ఇక్క‌డే వేసారు. సెల్వ‌రాజ్ అనే కార్మికుడిపై క్రేన్ లోని ఫోక‌స్ లైట్ తెగిప‌డ‌టంతో నాలుగు నెల‌ల చికిత్స అనంత‌రం క‌న్నుమూసాడు. ఇక ఇండియ‌న్ -2 షూటింగ్ జ‌రుగుతుండ‌గా మ‌ళ్లీ క్రేన్ రూపంలో మృత్యుఘంటిక మోగింది. ఈసారి ఘ‌ట‌న‌లో ఒకేసారి ముగ్గురు చ‌నిపోవ‌డం ప‌ది మంది తీవ్ర గాయాల పాల‌వ్వ‌డం.. క‌థానాయ‌కుడు క‌థానాయిక ద‌ర్శ‌కుడు తృటిలో త‌ప్పించుకోవ‌డం అంతా మాయ‌లా ఉంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఏమ‌రిస్తే చాలు ఇక్క‌డ ప్ర‌మాదం ఎదుర్కోవాల్సి ఉంటోంది. ఇలాంటి వ‌రుస ఘ‌ట‌న‌ల నేప‌థ్యం లో ఈవీపీని డెత్ స్పాట్ పిలుస్తున్నారు.