Begin typing your search above and press return to search.
నిర్మాతల మండలి అధ్యక్ష పదవి రేసులో?
By: Tupaki Desk | 7 Feb 2023 5:00 PMతెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టిఎఫ్‌పిసి)కి ఫిబ్రవరి 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తుత అధ్యక్షుడు నిర్మాత సి కళ్యాణ్ ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కళ్యాణ్ కౌన్సిల్ కు వ్యతిరేకంగా పనిచేసే వారిని హెచ్చరించారు. ఈ మండలి దశాబ్దాల చరిత్రతో కొనసాగుతోంది. మొత్తం 1200 మంది సభ్యులు ఇందులో ఉన్నారు. 9 కోట్ల మేర కౌన్సిల్ నిధులు పథకాల కోసం అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అలాగే కొంతకాలంగా మండలి ఎన్నికలను అడ్డుకున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరపాలని తీసుకున్న నిర్ణయం నిరాధార ఆరోపణలు అని కళ్యాణ్ తెలిపారు. తిరుపతిలో మా స్వంత భవనం ఉంది. కొన్నాళ్ల క్రితం సినిమా టవర్లలో రూ.2.40 కోట్లు పెట్టుబడి పెట్టాం. దాని విలువ ఇప్పుడు రూ.10 కోట్లుగా ఉందని కల్యాణ్ అన్నారు.
ప్రతిసారీ నిర్మాతల మండలి ఎన్నికల హోరా హోరీ గురించి తెలిసిందే. సాధారణ ఎన్నికల్లానే ఈ ఎన్నికల్లోను యుక్తులు కుయుక్తులతో రక్తి కట్టించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2023-25 సీజన్ కి నిర్మాతల మండలి ఎన్నికలు టాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్నాయి. తాజా సమాచారం మేరకు ఈసారి కూడా పోటాపోటీగా ఇరు ప్యానెళ్లు పోటీపడుతుండగా అధ్యక్ష పదవి బరిలో ఉన్న సభ్యుల వివరాలను పరిశీలిస్తే... వైవియస్ చౌదరి-పి.కిరణ్- దామోదర ప్రసాద్-కె.అశోక్ కుమార్-పీ.వి.రవికిషోర్-వి.వెంకట రమణారెడ్డి పోటీకి దిగుతున్నారు.
ఉపాధ్యక్ష పదవికి వైవియస్ చౌదరి-సిహెచ్ విఎస్ ఎన్ బాబ్జి-దామోదర ప్రసాద్- ప్రతాని-అశోక్ కుమార్- వై.సుప్రియ పోటీపడనున్నారు. గౌరవ సెక్రటరీలుగా జే.వి.మోహన్ గౌడ్- మోహన్ వడ్లపట్ల-టి . ప్రసన్నకుమార్- వైవియస్- సుప్రియ పోటీపడుతున్నారు. మోహన్ గౌడ్-బాబ్జి-నట్టికుమార్-రామసత్యనారాయణ- గురు రాజ్ సంయుక్త కార్యదర్శులుగా పోటీపడనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.