Begin typing your search above and press return to search.

మ‌హేష్ తో డీప్ ల‌వ్ లో ఉన్నా - న‌మ్ర‌త

By:  Tupaki Desk   |   24 Jan 2021 3:30 PM GMT
మ‌హేష్ తో డీప్ ల‌వ్ లో ఉన్నా - న‌మ్ర‌త
X
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యూట్ అండ్ స్వీట్ కపుల్ లిస్టు తీస్తే.. మహేష్ - నమత్ర పెయిర్ ముందు వరసలోనే ఉంటుంది. వీరి వివాహం జరిగి 15 ఏళ్లు గడిచాయి. తొలి చూపు ప్రేమ మొదలు.. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌మ జీవితం ఎంత అన్యోన్యంగా సాగుతోందో చెప్పారు న‌మ్ర‌త‌. ఆమె బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన న‌మ‌త్ర‌.. త‌న జీవితం, మ‌హేష్‌, ఫ్యామిలీ గురించి ఎన్నో విష‌యాలు షేర్ చేసుకున్నారు. త‌న మ‌న‌సు పొర‌ల్లో నిక్షిప్త‌మైన ప్రేమానురాగాలను అంద‌రికీ వివ‌రించారు. ఆ వివ‌రాలు ఆమె మాట‌ల్లోనే చూద్దాం...

మా వివాహం జ‌రిగి ఇప్ప‌టికీ 15 సంవ‌త్స‌రాలు. ఇంత‌కాలం తర్వాత కూడా మేమింకా డీప్‌ లవ్‌లో ఉన్నాం.. ఇప్పటికి మొదటి సారి మేము కలిసిన అనుభూతే క‌లుగుతుంది. ఇది ఎప్ప‌టికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది.

మొదటిసారి మహేష్‌ను ‘వంశీ’ మూవీ సెట్‌లో చూశాను. ఆ మూవీ కెరీర్ ప‌రంగా పెద్ద‌గా ఉపయోగపడలేదుకానీ.. ఆ సినిమాను ఎప్పటికీ మ‌ర‌వ‌లేం. మేమిద్దరం అక్కడే కలిశాం. అతడిని చూడగానే ‘నా మిగతా జీవితం ఇతడితోనే’ అనిపించింది . ఆ టైమ్‌లో మహేష్‌ ఫ్యామిలీకి నా గురించి ఏమీ తెలియదు. అదే సమయంలో నా పేరెంట్స్‌కు కూడా మహేష్‌ గురించి తెలియదు.

మేం ఆ సెట్‌లో మాట్లాడుకున్నాం. ఆ త‌ర్వాత‌ నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్నాం. 2005 ఫిబ్రవరి 10న మా వివాహం జరిగింది. అయితే.. ఈ నాలుగేళ్ల స‌మ‌యం ఎందుకు ప‌ట్టిందంటే.. నేనే తనకు సరైన భార్యనని ఫ్యామిలీలో ఒప్పించడం చాలా అవసరమనుకున్నాడు మహేష్‌. అందుకోసం నాలుగేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ నాలుగేళ్ల కాలంలో మేం కలిసింది చాలా తక్కువ. నేను మహేష్ కోసం ఎదురుచూడటం తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు.

ఆ నాలుగేళ్లలో నేను నిశ్చింతగా ఉన్నానని చెబితే అది అబద్ధమే అవుతుంది. అయితే.. మహేష్‌ను పెళ్లి చేసుకోవడం పక్కా అని తెలుసు. ఒక వేళ అదే జరగకపోయుంటే.. నేను ఎవ్వరినీ పెళ్లి చేసుకునేదాన్ని కాదు. అతను కూడా అంతే ష్యూర్‌గా ఉంటాడని నాకు తెలుసు.

నిత్యం ఎప్పుడు లేస్తున్నానో.. ఎప్పుడూ పడుకుంటున్నానో కూడా తెలియలేదు. నాకు జీవితంలో ఇంకేం అవసరం లేదనిపించింది. నా భర్త.. ఇద్దరు పిల్లలే నా ప్రపంచం. ఖాళీ స‌మ‌యం ల‌భిస్తే.. ఏం చేస్తారు అని ఎవ‌రైనా న‌న్ను ప్రశ్నిస్తే.. నాకు ఆ ఖాళీ వద్దని చెబుతాను. ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పడం వద్దు. అసలు మహేష్‌కు దూరంగా ఉండటమనేది వద్దే వద్దు. రెండు రోజులు మహేష్‌ కనిపించకపోతే.. తనను చాలా మిస్‌ అవుతాను. నా మ్యారేజ్‌ లైఫ్‌ను పక్కన పెట్టి సాహ‌సాలు, యాత్రలు చేసే శక్తి నాకు లేదు.

మహేష్‌ కేరీర్‌కు సంబంధించిన నిర్ణ‌యాల్లో మీ పాత్ర ఎంత అని అడిగితే.. లేదనే చెపుతాను. మహేష్‌ స్క్రిప్ట్‌లను నేను సెలెక్ట్‌ చేస్తాననేది పెద్ద అబద్ధం. నాకే అంత స్క్రిప్ట్‌లను సెలెక్ట్‌ చేసే శ‌క్తి ఉంటే.. బాలీవుడ్‌లో కొన్ని దారుణమైన ఫ్లాప్ సినిమాల్లో ఎలా నటిస్తాను చెప్పండి?

నా జీవితంలో తీర‌ని కోరిక ఏదైనా ఉందా? అని ఎవ‌రైనా అడిగితే.. క్షణం ఆలోచించ‌కుండా నో అంటాను. నా లైఫ్‌ డ్రీమ్ మ‌హేష్‌. ఆ కల చెదరకుండా ఉండేలా.. అసలు నిద్రలో నుంచే లేవను. మేమిద్ద‌రం మా‌ పెళ్లికి ఎంత విలువ ఇస్తామో.. మా పిల్లలు కూడా అంతే విలువ ఇస్తాం. ఇండస్ట్రీలో ఎన్నో ఘటనలు చూస్తున్నాం. కానీ.. మాది వేరే. మాలో ఒక‌రి ప్రాణం ఒకరిలో ఉందని భావిస్తాం. జీవితంలో నాకు దక్కిన గొప్ప అదృష్టం ఏదైనా ఉందంటే.. అది మహేష్‌ను కలవడ‌మే.