Begin typing your search above and press return to search.

ఒక వర్గం గురించి సినిమా తీస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   26 July 2021 12:30 AM GMT
ఒక వర్గం గురించి సినిమా తీస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాడు
X
సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ కుర్ర డైరెక్టర్ సినిమా చేయబోతున్నాడని చర్చ జరిగినపుడే పా. రంజిత్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అంతటి సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలను తెరకెక్కించి.. మొత్తం సినిమా ఇండస్ట్రీ తన వైపు తిరిగి చూశేలా చేశాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. కానీ మనోడు తెరకెక్కించిన కబాలి సినిమా విడుదలకు ముందే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రచార గీతాలు, టీజర్, ట్రైలర్ తో సినిమాకు ఎక్కడ లేని హైప్ వచ్చింది. అంతలా జనాలను మాయ చేశాడు పా రంజిత్.

రజనీని డైరెక్ట్ చేసే ముందు అతడు రెండంటే రెండే సినిమాలకు దర్శకత్వం వహించాడు. కానీ ఆ సినిమాల్లో అతడి దర్శకత్వ ప్రతిభ నచ్చిన సూపర్ స్టార్ తన స్టార్ డమ్ ను కూడా పక్కన పెట్టి మరీ పా. రంజిత్ కు అవకాశం ఇచ్చాడు. కానీ పా. రంజిత్ సూపర్ స్టార్ తో చేసిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను తమ వైపు తిప్పుకోవడంలో విఫలం అయ్యాయి. అయినా కానీ ఈ యువ దర్శకుడు ఏ మాత్రం బెదరలేదు. ఆర్యని హీరోగా పెట్టి బాక్సింగ్ నేపథ్యంలో తమిళంలో చేసిన సార్పట్ట మూవీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఈ మూవీని థియేటర్ల మూత కారణంగా ప్రముఖ వీడియో స్ర్టీమింగ్ ప్లాట్ ఫాం అమోజాన్ ప్రైమ్ లోల ఇటీవలే విడుదల అయిన ఈ మూవీకి అందరూ కనెక్ట్ అవుతున్నారు.

ఇలా వైవిద్యభరితంగా సినిమాలు చేసే దర్శకుడు పా. రంజిత్ గురించి మరో విషయం చెప్పుకోవాలి. పా. రంజిత్ దళితుడన్న విషయం కోలీవుడ్ సినీ ఇండస్ర్టీలో చాలా మందికి తెలుసు. అతడు తన ప్రతి సినిమాలోనూ దళిత వాడలను చూపిస్తూ... ఉంటాడు. ఇలా రజనీకాంత్ నటించిన కబాలి, కాలా సినిమాల్లో కూడా డైరెక్టుగా చెప్పకపోయినా హీరోను దళిత నేపథ్యంలో చూపించాడు. హీరో అగ్రవర్ణాల వారితో పోరాడే విధానాన్ని తెరకెక్కించాడు. అలాగే తన ప్రస్తుత మూవీ ఆర్య హీరోగా నటించిన సార్పట్టా సినిమాలో కూడా హీరోని దళితుడిగానే చూపించడం విశేషం. ఈ విషయాన్ని డైరెక్టుగా చెప్పకపపోయినా.. హీరో పెళ్లి సమయంలో వాళ్ల స్నేహితులు అంబేద్కర్ ఫొటోను గిఫ్ట్ గా ఇవ్వడం చూపించాడు.

తాను మాత్రమే అలా సినిమాలు తీయడం కాకుండా దళిత నేపథ్యంలో ఎవరు సినిమాలు చేసినా కూడా పా. రంజిత్ మెచ్చుకుంటూ ఉంటాడు. తెలుగులో పలాస 1978 సినిమా దళిత నేపథ్యంలోనే వచ్చింది. ఆ మూవీ డైరెక్టర్ కరుణ్ కుమార్ ను పా. రంజిత్ మెచ్చుకున్నాడు. ఇలా డైరెక్టర్ పా. రంజిత్ దళితుల గురించి కేవలం తన సినిమాల్లో చెప్పడమే కాకుండా దేశంలో ఎక్కడ దళితుల మీద అఘాయిత్యాలు జరిగినా కూడా స్పందిస్తాడు. ఒక వర్గం గురించి సినిమాలు తీస్తూ అన్ని వర్గాల వారిని తన సినిమాలతో కట్టిపడేయడంలో ఈయనకు ఈయనే సాటి అనడంలో సందేహం లేదు. దళితులను అన్ని విషయాల్లో జాగృతం చేస్తూ ఉంటాడు. ఇలా ఒక టాప్ డైరెక్టర్ దళితుడినని చెప్పుకోవడం చాలా అరుదు అని అందరూ అనుకుంటారు.