ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ని టచ్ చేయడం కష్టమే..!

Tue Jan 31 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Impossible To Reach Prabhas After These Films

బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ ఆ మూవీ తో వచ్చిన నేషనల్ క్రేజ్ తో తన ప్రతి సినిమాను అదే రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు. సాహో రాధే శ్యాం రెండు సినిమాలు నేషనల్ లెవెల్ లో రిలీజ్ అయ్యాయి. అయితే ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేదు. సాహో తెలుగులో నిరాశపరచినా బాహుబలి ఎఫెక్ట్ తో నార్త్ సైడ్ ప్రాఫిట్స్ తెచ్చింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ కె.జి.ఎఫ్ డైరెక్టర్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. అంతకుముందు యశ్ ఎవరో పెద్దగా తెలియకపోయినా తన ఎలివేషన్స్ తో అతనికి స్టార్ డం తెచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.అలాంటిది బాహుబలి తో ఆల్రెడీ దేశం మొత్తం తన మాయలో పడేసుకున్న ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో అంచనా వేయొచ్చు. సలార్ మాత్రమే కాదు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న ప్రాజెక్ట్ కె కూడా హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. ఇక మరోపక్క మారుతి రాజా డీలక్స్ కూడా క్రేజీ మూవీ గా వస్తుంది.

వీటి తర్వాత సందీప్ వంగ స్పిరిట్ కూడా ఉంది. ఆ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అర్జున్ రెడ్డితో తన సత్తా చాటిన సందీప్ ప్రస్తుతం యానిమల్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ ఉంటుంది.

ఈ సినిమాల లిస్ట్ చూస్తుంటే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదు పాన్ వరల్డ్ స్టార్ గా ఎదగడం పక్కా అని చెప్పొచ్చు. సలార్ ఎలాగు మాస్ హిట్ కొట్టడం పక్కా అని చెప్పొచ్చు. ప్రాజెక్ట్ కె మాత్రం భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో రాబోతుంది. వీటి మధ్యలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాలన్ని చేసిన తర్వాత ప్రభాస్ ని టచ్ చేయడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. ప్రభాస్ కి మాత్రమే సాధ్యమయ్యేలా ఈ కాంబినేషన్స్ కుదిరాయి.

తప్పకుండా రెబల్ స్టార్ ఇండియన్ బాక్సాఫీస్ పై తన స్టామినా చూపిస్తాడని చెప్పొచ్చు. ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాల గురించి ఆయన ఫ్యాన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సలార్ ఆదిపురుష్ ప్రాజెక్ట్ K రాజా డీలక్స్ స్పిరిట్ ఇలా దాదాపు ఐదేళ్ల వరకు తన షెడ్యూల్ బిజీ చేసుకున్నాడు ప్రభాస్.

కొత్తగా ప్రభాస్ తో సినిమా చేయాలి అనుకుంటే లిస్ట్ లో ఉన్న ఈ సినిమాలన్ని పూర్తి చేశాక అది కుదురుతుంది. మొత్తానికి ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ లతో టాలీవుడ్ సత్తా మరోసారి ప్రపంచానికి తెలియనుందని చెప్పొచ్చు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.