నేను బిగ్ బాస్ లోకి రాను.. పుకార్లు రేపకండి: హాట్ యాక్ట్రెస్ రిక్వెస్ట్

Thu Jun 10 2021 22:00:25 GMT+0530 (IST)

Im not into Bigg Boss Dont spread rumors

తెలుగు ప్రేక్షకులు కొన్ని నెలలుగా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికి నాలుగు సీసన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఈసారి 5వ సీజన్ గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తూ ప్రేక్షకులలో అంచనాలు పెంచుతోంది. చూస్తుంటే నిజంగానే ఏదో బిగ్ ప్లాన్ ఆలోచనలో ఉన్నారని అనిపిస్తుంది. ఈ రియాలిటీ షో ఫస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మొదలవగా.. సెకండ్ సీసన్ నాని హోస్ట్ చేసాడు. ఇక మూడో సీసన్ నుండి కింగ్ నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నాడు.రానున్న ఐదవ సీజన్ కూడా కింగ్ నాగ్ హోస్ట్. ఇదివరకు ప్రారంభం కావాల్సిన ఈ రియాలిటీ షో.. కరోనా రావడంతో ఇంతకాలం బ్రేక్ పడింది. అయితే త్వరలోనే బిగ్ బాస్ మొదలవుతుంది అనేసరికి ఫ్యాన్స్ లో కంటెస్టెంట్స్ ఎవరనే ఆసక్తి మొదలైంది. ఈసారి బిగ్ బాస్ న్యూ సీసన్ లో యూట్యూబ్ స్టార్స్ తో పాటుగా టాలీవుడ్ హీరోలు హీరోయిన్స్ దిగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్త తెలిసినప్పటి నుండి అభిమానులకు ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో వీరే రాబోయే కంటెస్టెంట్స్ అంటూ లిస్ట్ కూడా హల్చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ నిర్వాహకులు హీరోయిన్ పాయల్ రాజపుత్ ను సంప్రదించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ రూమర్స్ పై స్వయంగా పాయల్ రాజపుత్ స్పందించి సోషల్ మీడియాలో రూమర్స్ కొట్టిపారేసింది. 'తాను తెలుగు బిగ్ బాస్ 5వ సీసన్ లో పార్టిసిపేట్ చేయడం లేదని.. ఇకపై ఇలాంటి ఫేక్ పుకార్లు స్ప్రెడ్ చేయకండి' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం పాయల్ పోస్ట్ వైరల్ అవుతోంది. అలాగే పాయల్ త్వరలో ఓ బిగ్ మూవీ ఐటమ్ సాంగ్ లో ఆడిపాడనుందనే రూమర్స్ కూడా ఫేక్ అని తెలిపింది అమ్మడు. ఆర్ఎక్స్100 మూవీతో కెరీర్ ప్రారంభించిన పాయల్.. ఆ తర్వాత అలాంటి సాలిడ్ హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం అమ్మడు ఏంజెల్ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. మొత్తానికి ఈ గ్లామర్ బ్యూటీ బిగ్ బాస్ లో ఉండదనే సరికి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారట. చూడాలి మరి గత సీసన్ లా ఈసారి ఎలాంటి బ్యూటీలు రానున్నారో..!