Begin typing your search above and press return to search.

నేను నేపో బేబీని కాదు: ప్రియాంక చోప్రా జోనాస్

By:  Tupaki Desk   |   31 March 2023 9:00 PM GMT
నేను నేపో బేబీని కాదు: ప్రియాంక చోప్రా జోనాస్
X
బాలీవుడ్ లో రాజకీయాలు.. మాఫియా బంధుప్రీతి నిరంత‌రం హాట్ టాపిక్. కంగ‌న వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా ఈ రెండు అంశాల‌ను ప్ర‌స్థావిస్తూ కొంద‌రు సినీపెద్ద‌ల‌ను ఢీకొంటూనే ఉంది. ఇప్పుడు ఫ్యాష‌న్ (మ‌ధుర్ భండార్క‌ర్ మూవీ) కొలీగ్ ప్రియాంక చోప్రా కూడా కంగ‌న‌తో పాటు రేసులోకి చేరింది.

ఇటీవ‌ల కొంత కాలంగా ప్రియాంక చోప్రా మాట‌ల తూటాలు పేలుస్తూ చెల‌రేగుతోంది. త‌న త‌దుప‌రి చిత్రం సిటాడెల్ ను ప్రమోట్ చేసుకునేందుకు ఈ కొత్త ఎత్తుగ‌డ‌ను అనుస‌రిస్తోంది. అలాంటి ఒక ఇంట‌ర్వ్యూలో హిందీ చిత్ర పరిశ్రమపై తుపాకి గుళ్లు కురిపించింది. మాజీ ప్రపంచ సుందరి తాను చిన్న వయస్సులోనే చిత్ర నిర్మాణ వ్యాపారంలోకి ఎందుకు అడుగుపెట్టిందో వెల్ల‌డించింది.బాక్సాఫీస్ వద్ద త‌న సినిమా స‌రిగా ఆడ‌క‌పోతే మ‌రో సినిమా చేసే 'మామ' త‌న‌కు లేర‌ని వ్యంగ్యాస్త్రం సంధించింది. బంధుప్రీతితో సినీ పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందిందో త‌న వాద‌న వినిపించింది.

డాక్స్ షెపర్డ్ పోడ్ కాస్ట్- ఆర్మ్ చైర్ ఎక్స్ పర్ట్ షోలో ఇంకా చాలా గ‌మ్మ‌త్త‌యిన ర‌హ‌స్యాల గుట్టు విప్పింది పీసీ. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. తనను ఒక మ్యాగజైన్ కవర్ పై 'ఫినిష్డ్' అని రాశారని.. ఆ ప్ర‌త్యేక క‌థ‌నం చ‌దివాక‌.. వ్యాపార చతురత కలిగిన తన తల్లి ఆందోళనకు గురైందని చెప్పారు. ఆమె తల్లి డా. మధు చోప్రా తనతో సీరియస్ గా మాట్లాడారు. త్వరలో 30 ఏళ్లు వచ్చేస్తున్నాయ్. నీ కంటే 20 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌వారిని ప‌రిశ్ర‌మ వెతుకుతుంది. ఇతర ఆదాయ వనరులను చూడమని సలహా ఇచ్చిందని పీసీ చెప్పారు.

"త్వరలో 30 ఏళ్లు వ‌చ్చేస్తే పరిశ్రమలో పాత‌త‌రం కింద లెక్క‌. వారు(సినీ మాఫియా పెద్ద‌లు) 20 ఏళ్ల యంగ్ గాళ్స్ తో కలిసి పనిచేయాలనుకుంటారు కాబట్టి నువ్వు నిన్ను నిలబెట్టుకోవాలంటే ఆదాయ మార్గం గురించి ఆలోచించాలి!" అని ప్రియాంక తల్లి చెప్పారు.

సినీ కుటుంబాలకు చెందిన వారు లేదా ప్రభావవంతమైన వ్యక్తులతో పరిశ్రమలో సంబంధాలు కలిగి ఉన్న వారిపై వ్యాఖ్యానిస్తూ.. తాను బయటి నుంచి ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన‌ వ్యక్తిని అని హైలైట్ చేసింది. ప్రియాంక 2000లో ప్రపంచ సుందరి పోటీని గెలుచుకున్న తర్వాత.. బాలీవుడ్ కి వెళ్లింది. అంత‌కుముందే 2002లో ద‌ళ‌పతి విజయ్ నటించిన తమిళ చిత్రం 'తమిజన్‌'తో రంగప్రవేశం చేసింది.

పీసీ బంధుప్రీతి గురించి ప్ర‌స్థావిస్తూ.. ప‌రిశ్ర‌మ‌లోని వారంతా అనేక తరాలకు చెందిన నటవార‌సులు అని మ‌న‌కు తెలుసు. వారు బయటి నుండి వచ్చిన వారికి వ్యతిరేకంగా వ‌రుస‌ అవకాశాలను పొందుతారు. మీ 'మామ' మీ కోసం సినిమా తీయడం లేదు. స‌రైన మార్గం ఏమిటంటే.. మ‌నం ఆఫ‌ర్ పొందాలి అంటే దాని కోసం చాలా హడావిడి చేయాలి.. అని త‌న‌దైన శైలిలో వ్యంగ్యాస్త్రం సంధించారు పీసీ.

తన కోసం ఎవరూ సంతకం చేయరని ...త‌న‌కు ఉద్యోగం రాదనే భయంతో జీవించనని ప్రియాంక చెప్పింది. తన కోసం సినిమాలు చేయడం ప్రారంభించడం తప్ప వేరే మార్గం లేదని అంది. వాస్తవానికి ఇలాంటి ఆందోళ‌న కారణంగా నేను ప్రొడక్షన్ లోకి వచ్చాను. కానీ నేను నేపో బేబీని కాను కాబట్టి ఆ 6 సినిమాలు బాగా ఆడకపోవడంతో నేను భయపడ్డాను. నాకు ఈ రంగంలో అవ‌స‌ర‌మైన మద్దతు లేదు. బాలీవుడ్ ఇత‌ర రంగాల‌తో పోలిస్తే పెద్దది అని నిర్మాత‌గా త‌న అనుభ‌వాల‌ను వివరించింది.

హిందీ చిత్ర పరిశ్రమ నుండి బంధుప్రీతిపై ఫైరైన తొలి న‌టి ప్రియాంక కాదు. గతంలో క్వీన్ కంగనా రనౌత్, కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్' షోలో బాలీవుడ్ లో 'నెపోటిజం రాజు' అని సూటిగా వ్యాఖ్యానించారు. అదే ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా అమెరికాకు మారడం గురించి కూడా మాట్లాడింది. తాను 'బాలీవుడ్ లో రాజకీయాల'తో పోరాడుతున్నానని.. ఎలాగైనా బయటపడే మార్గం కోసం వెతుకుతున్నానని చెప్పింది. పీసీ న‌టించిన సిటాడెల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగుకి రెడీ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.