చడీచప్పుడు లేకుండా ఇల్లీ బేబి ఇలా చేస్తుందనుకోలేదు!

Fri Nov 20 2020 09:15:10 GMT+0530 (IST)

Illy Baby never wanted to do this without being scolded!

ప్రేమ వైఫల్యం తర్వాత తిరిగి కథానాయికగా కంబ్యాక్ అయ్యేందుకు ఇల్లీ బేబి చేయని ప్రయత్నం లేదు. బాలీవుడ్ లో ఓ అగ్ర హీరో తనకు లిఫ్టిస్తున్నా.. భారీ చిత్రాల్లో ఆఫర్లు మాత్రం నిల్. ప్రస్తుతం కెరీర్ పరంగా ఆల్మోస్ట్ ఖాళీ అన్న టాక్ వినిపిస్తోంది.అభిషేక్ బచ్చన్ సరసన నటిస్తున్న `ది బిగ్ బుల్` మినహా వేరొక సినిమా లేనే లేదని అనుకున్నారంతా. అది కూడా హీరో కం నిర్మాత అజయ్ దేవగన్ పట్టుబట్టి మరీ ఇలియానాకి ఈ ఆఫర్ ఇచ్చాడని ముచ్చటించుకున్నారు.

అయితే చడీ చప్పుడు లేకుండా ఇలియానా వేరొక బాలీవుడ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసేయడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. ఇలియానా ప్రస్తుతం `అన్ ఫెయిర్ అండ్ లవ్ లీ` అనే బాలీవుడ్ మూవీలో నటిస్తున్న సంగతి ఎవరికీ తెలియదు. రణదీప్ హుడా ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు.

ఐదు నెలల విరామం తరువాత.. అన్ ఫెయిర్ అండ్ లవ్ లీ షూటింగ్ సెప్టెంబర్ నెలలో తిరిగి ప్రారంభమైంది. ఈ గ్యాప్ వల్లనే బహుశా మైండ్ లో అంతగా రిజిస్టర్ కాలేదు ఈ మూవీ. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ప్రధాన షూటింగ్ నేటితో పూర్తయిందిట. ముబారకన్ కథా రచయిత బల్విందర్ సింగ్ జంజున ఈ మూవీకి దర్శకుడు. సోనీ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.