బేబీ బంప్ తో ఇలియానా ఫోజులు..!

Fri May 26 2023 11:11:02 GMT+0530 (India Standard Time)

Ileana pics with baby bump..!

ఇలియానా గురించి టాలీవుడ్ జనాల కు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవదాసు సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమాలో తన నడుము అందాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ పోకిరి తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అప్పటి నుంచి ఆమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకున్నదిలేదు. వరస అవకాశాలతో దూసుకుపోయింది.



ఆ తర్వాత ఆమె కన్ను బాలీవుడ్ పై పడింది. బాలీవుడ్ లో అవకాశాలు అరకొర అయితే లభించాయి. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈ లోగా తాను తల్లికాబోతున్నానంటూ ప్రకటించి అందరినీ షాకింగ్ కి గురి చేసింది. గతంలో ఓ వ్యక్తి తో డేటింగ్ చేసింది. కానీ అతనితో విడిపోయినట్లు తానే ప్రకటించింది. ఆ తర్వాత కత్రినా కైఫ్ సోదరడితో డేటింగ్ మొదలుపెట్టిందనే వార్తలు అయితే వచ్చాయి కానీ ఆ విషయంలో ఆమె క్లారిటీ ఇవ్వలేదు.

దీంతో ఆమె గర్భం దాల్చిందికానీ తండ్రి ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. ఆమె తన ప్రెగ్నెన్సీ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన కూడా నెటిజన్లు ఇదే ప్రశ్న వేస్తున్నారు. బేబీ తండ్రి ఎవరు అని అడుగుతున్నారు. దానికి మాత్రం ఇలియానా నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం విశేషం.

అయితే తాజాగా అద్దం ముందు తన బేబీ బంప్ తో సెల్ఫీలు దిగి వాటిని షేర్ చేసింది. ఒక సెల్ఫీలో ఎదురుగా నిలపడి ఫోటో దిగగా మరో ఫోటోలో సైడ్  యాంగిల్ లో ఉన్న ఫోటోని ఆమె షేర్ చేయడం విశేషం. స్ట్రైట్ గా ఉన్న యాంగిల్ లో ఇలియానా నార్మల్ గానే కనిపిస్తోంది. సైడ్ యాంగిల్ మాత్రం ఆమె బేబీ బంప్ కనిపిస్తోంది.  దీంతో మ్యాటరంతా యాంగిల్స్ లోనే ఉంది అంటూ క్యాప్షన్ పెట్టడం విశేషం.

ఇక సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం ఈ గోవా బ్యూటీ 'అన్ఫేర్ అండ్ లవ్లీ' అనే హిందీ సినిమా లో నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది.