Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఇల్లీ బికినీయిజం కేరాఫ్ గోవాపాలెం!

By:  Tupaki Desk   |   21 Feb 2020 11:30 PM GMT
ఫోటో స్టోరీ: ఇల్లీ బికినీయిజం కేరాఫ్ గోవాపాలెం!
X
గోవా బ్యూటీ ఇలియానా డీక్రజ్ పేరు తెలియనివారు తెలుగు సినిమా ప్రేమికులు అని చెప్పుకునేందుకు అనర్హులని తేల్చేయవచ్చు. ఎందుకంటే తెలుగులో ఉండే టాప్ స్టార్ హీరోలు అందరితోనూ ఆడిపాడి హిట్లు కూడా సాధించింది. ఇప్పుడంటే టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయింది కానీ ఒక దశలో ఇల్లీ ఇక్కడ స్టార్ హీరోయిన్. ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ లోనే మకాం. బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో బ్రేకప్ కూడా అయింది కాబట్టి సింగిల్ గా రెచ్చిపోతోంది. ఫోటోషూట్లతో సోషల్ మీడియాకు సమ్మర్ ను త్వరగా తీసుకొచ్చే ప్రయత్నాలలో ఉంది.

ఇల్లీ బేబీ ఈమధ్య తన గోవా బీచ్ సంప్రదాయం కొనసాగిస్తూ ఓ కత్తి లాంటి ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోషూట్ లో తెలుపు రంగు బికినీ.. పైనేమో అత్యంత పారదర్శకంగా ఉండే ఉల్లిపొర లాంటి వైట్ టాప్ ధరించి గ్రీకుదేవత తరహాలో నిలుచుంది. గాలికి ఎగురుతున్న జుట్టును సరిచేసుకుంటున్నట్టుగా ఒక చేతిని తలపై పెట్టుకుంది. చేతికి రిస్ట్ బ్యాండ్ తో పాటుగా ఏదో రాగి కడియం లాంటిది కూడా ధరించింది. ఆ పోజు.. సైడ్ యాంగిల్ లో ఒంపులు చూస్తుంటే ఎలాంటి స్త్రీద్వేషి అయినా గోవా పాపకు వీరాభిమాని గా మారిపోవాల్సిందే. నిద్రలో కూడా ఇల్లీ ఇల్లీ అని కలవరించాల్సిందే.

ఈ ఫోటో దెబ్బకు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఉష్ణోగ్రతలు కనీసం ఐదారు డిగ్రీలు పెరిగాయి. అయితే టీవీ ఛానల్స్ అంతా కెవ్వు కేకలతో బిజీగా ఉంటారు కాబట్టి సోషల్ మీడియా ఉష్ణోగ్రతలలో వచ్చిన మార్పును.. ఈ గోవా ఋతుపవనాలను అసలు గమనించలేదు. ఈ హీటు వేవ్ సంగతి పక్కన పెట్టి ఇల్లీ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కుకీ గులాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న 'ది బిగ్ బుల్' అనే హిందీ సినిమాలో నటిస్తోంది.